Monday, August 29, 2016

క్షీరసాగరమథనం – అసురుల కమృతము

8-315-వ.
అప్పుడు
8-316-క.
సురుల కమృతము పోయుట
పొగదు పాములకుఁ బాలు పోసిన మాడ్కిన్
దొసఁగగు నంచును వేఱొక
దెసఁ గూర్చుండంగఁ బెట్టె దేవాహితులన్.
8-317-వ.
ఇట్లు రెండు పంక్తులుగా నేర్పరచి.

టీకా:
            అప్పుడు = అప్పుడు.
            అసురుల్ = రాక్షసుల; కున్ = కు; అమృతము = అమృతము; పోయుట = పోయుట; పొసగదు = కుదరదు; పాముల్ = సర్పముల; కున్ = కు; పాలు = పాలను; పోసిన = పోసినట్టి; మాడ్కిన్ = విధముగా; దొసగు = ఆపద; అగున్ = కలుగును; అంచున్ = అనుచు; వేఱొక = మరొక; దెసన్ = దిక్కునందు, పక్కగా; కూర్చుండంగన్ = కూర్చొన; పెట్టెన్ = పెట్టెను; దేవాహితులన్ = రాక్షసులను.
            ఇట్లు = ఈ విధముగా; రెండు = రెండు; పంక్తులు = వరుసలు; కాన్ = అగునట్లు; ఏర్పరచి = ఏర్పాటుచేసి.

భావము:
            అలా దేవదానవులు సిద్దపడుతున్న సమయంలో. . .
“రాక్షసులకు అమృతం పోయడం అంటే, పాములకు పాలుపోసినట్లే, ఆపదలు కలిగిస్తుంది” అంటూ మోహినీ దేవి అసురులను అందరిని ప్రత్యేకంగా ఒక ప్రక్క కూర్చోబెట్టింది.
            అలా దావదానవులను రెండు వేరువేరు వరుసలుగా కూర్చోబెట్టింది


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: