Friday, August 26, 2016

క్షీరసాగరమథనం – నా నేర్చుకొలది

అష్టమ స్కంధముఅమృతము పంచుట

8-310-క.
నా నేర్చుకొలది మీకును
మానుగ విభజించి యిత్తుమానుఁడు శంకన్
కా నిం డనవుడు నిచ్చిరి
దావు లమృతంపుఁ గడవఁ రుణీమణికిన్.
8-311-క.
 శాంతా లోకనములు
నా శీతల భాషణములు నా లాలితముల్
రాశి పరంపర లగుచుం
బాములై వారి నోళ్ళు బంధించె నృపా!

టీకా:
            నా = నాకు; నేర్చు = చేతనయిన; కొలది = వరకు; మీకునున్ = మీకు; మానుగన్ = తప్పక; విభజించి = పంచి; ఇత్తు = పెట్టెదను; మానుడు = విడువుడు; శంకన్ = అనుమానమును; కానిండు = అలానేజరగనీయండి; అనవుడు = అనగా; ఇచ్చిరి = ఇచ్చిరి; దానవులు = రాక్షసులు; అమృతంపు = అమృతముగల; కడవన్ = పాత్రను; తరుణీమణి = సుందరి; కున్ = కి.
ఆ = ఆ; శాంత = శాంతమైన; ఆలోకనములున్ = చూపులు; శీతల = చల్లని; భాషణములున్ = మాటలు; ఆ = ఆ; లాలితముల్ = సౌకుమార్యములు; రాశి = బహుళ; పరంపరలు = వరుసలుగా; అగుచున్ = అగుచు; పాశములు = తాళ్లవలె; ఐ = అయ్యి; వారి = వారి యొక్క; నోళ్ళు = నోళ్ళను; బంధించెన్ = కట్టివేసినవి; నృపా = రాజా.

భావము:
            సరే! అనుమానాలు వదలిపెట్టండి. అలాగే కానివ్వండి. శక్తివంచన లేకుండా చక్కగా పంచిపెడతాను.” ఇలా జగన్మోహిని చెప్పగా, దానవులు మాట్లాడకుండా, అమృతకలశాన్ని ఆ వనితారత్నానికి ఇచ్చారు.
            ఓ రాజా పరీక్షిత్తూ! ఆ జగన్మోహినీదేవి మెరుగారు చూపులూ, చల్లని పలుకులూ, బుజ్జగింపులూ కట్టుతాళ్ళలా సాగి సాగి రాక్షసుల నోళ్ళను కట్టేశాయి.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: