Sunday, August 21, 2016

క్షీరసాగరమథనం – పాలిండ్లపై నున్న

8-302-వ.
అయ్యవసరంబున జగన్మోహనాకారంబున.
8-303-సీ.
పాలిండ్లపై నున్న య్యెద జాఱించు
జాఱించి మెల్లన క్క నొత్తు
ళ్కు దళ్కను గండలకంబు లొలయించు
నొలయించి కెంగేల నుజ్జగించుఁ
టు మెఱుంగులు వాఱు డకన్ను లల్లార్చు
ల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు
వరని దరహాస చంద్రికఁ జిలికించుఁ
జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు
8-303.1-తే.
ళిత ధమ్మిల్ల కుసుమ గంమ్ము నెఱపుఁ
గంకణాది ఝణంకృతుల్ డలు కొలుపు
నొడలి కాంతులు పట్టులే కులుకఁ బాఱు
న్నవలిపంపుఁ బయ్యెద చౌకళింప.

టీకా:
            ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; జగన్మోహన = జగన్మోహిని; ఆకారంబున = రూపముతో.
            పాలిండ్ల = స్తనముల; పైన్ = మీదను; ఉన్న = ఉన్నట్టి; పయ్యెదన్ = పైటను; జాఱించు = తొలగునట్లుచేయును; జాఱించి = జారునట్లుచేసి; మెల్లన = మెల్లిగా; చక్కనొత్తు = సరిచేయును; తళ్కుదళ్కను = తళతళలాడెడి; గండఫలకంబును = చెక్కిళ్ళు; ఒలయించున్ = పుణుకును; ఒలయించి = పుణికి; కెంగేలన్ = వేలిచివర్లతో; ఉజ్జగించున్ = బుజ్జగించును; కటు = చిక్కని; మెఱుంగులు = తళుకులు; వాఱు = ప్రసరించెడి; కడకన్నులు = పక్కచూపులకళ్లను; అల్లార్చున్ = చలింపచేయును; అల్లార్చి = చలింపజేసి; ఱెప్పలన్ = కనురెప్పలను; అండ = ఆశ్రయము; కొలుపు = కలిపించును; సవరని = చక్కని; దరహాస = చిరునవ్వుల; చంద్రికలన్ = వెన్నెలలను; చిలికించున్ = జల్లును; చిలికించి = చిలకరించి; కెంపు = ఎర్రని; మోవిన్ = పెదవిని; చిక్కుపఱచున్ = మెలిపెట్టును. 
            దళిత = విరసిన; ధమిల్ల = కొప్పునందలి; కుసుమ = పూల; గంధమ్మున్ = పరిమళమును; నెఱపున = వ్యాపింపజేయును; కంకణ = కంకణములు; ఆది = మున్నగువాని; ఝణంకృతులు = ఝణఝణరవములను; కడలుకొలుపున్ = వెదజల్లును; ఒడలి = దేహముయొక్క; కాంతులున్ = ప్రకాశములను; పట్టులేక = పట్టలేక; కులుకుబాఱున్ = వయ్యారాలుపోవును; సన్న = పల్చటి; వలిపంపు = తెల్లని; పయ్యెదన్ = పైట; చౌకళింపన్ = అల్లల్లాడగా.

భావము:
ఆ సమయంలో, శ్రీమహావిష్ణువు, అలా లోకాన్ని అంతటినీ మొహింపజేసే రూపంతో మాయామోహినీ అవతారం ధరించి. . . . .
            పైటకొంగును వక్షోజాలపైనుండి జార్చి, మెల్లగా సర్దుకుంటోంది. తళతళ మెరుస్తున్న చెక్కిళ్ళను చేతిపై చేర్చి మరల వదిలివేస్తోంది. జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి, మళ్ళీ కనురెప్పలు మూస్తోంది. అందంగా చిరునవ్వులు చిలకరించి, ఎర్రని పెదవుని మెలిపెడుతోంది, కొప్పులోని వికసించిన పూలపరిమళాలు వ్యాపింపజేసి, కంకణాదులను మ్రోగేలా చేస్తోంది. నిలకడ లేకుండా మెలగుతూ నెమ్మేని కాంతులను పొంగిపొరలేలా చేస్తూ, పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: