8-275-సీ.
భావించి యొకమాటు బ్రహ్మాండ మంతయు;
నాటల బొమ్మరిల్లని తలంచుఁ
బోలించి యొకమాటు భువనంబు లన్నియుఁ;
దన
యింటిలో
దొంతులని తలంచుఁ
బాటించి యొకమాటు బ్రహ్మాది సురులను;
దన
యింటిలో
బొమ్మలని తలంచు
గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు;
నలవడ బొమ్మపీఁటని తలంచు
8-275.1-ఆ.
సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల
నచటి దీపకళిక లని తలంచు
భామ యొక్క మాటు భారతీదుర్గల
నాత్మసఖు లటంచు నాదరించు.
8-276-వ.
తదనంతరంబ.
టీకా:
భావించి = తలచి;
ఒకమాటు = ఒకసారి;
బ్రహ్మాండము = బ్రహ్మాండము;
అంతయున్ = సమస్తము;
ఆటల =
ఆడుకొనుటకైన;
బొమ్మరిల్లు = ఇల్లుబొమ్మ;
అని = అని; తలంచున్ = అనుకొనును;
పోలించి = పోల్చుకొని;
ఒకమాటు = ఒకసారి;
భవనంబులు = లోకములు;
అన్నియున్ =
సమస్తము; తన = తన యొక్క;
ఇంటి = గృహము;
లోన్ = అందలి;
దొంతులు = కుండలపేర్పు;
అని = అని; తలంచున్ = అనుకొనును;
పాటించి = పూని;
ఒకమాటు = ఒకసారి;
బ్రహ్మ =
బ్రహ్మదేవుడు;
ఆది = మున్నగు;
సురులను = దేవతలను;
తన = తన యొక్క;
ఇంటి = గృహము;
లోన్ = లోని;
బొమ్మలు = బొమ్మలు;
అని = అని; తలంచున్ = అనుకొనును;
కొనకొని =
పూని; ఒకమాటు = ఒకసారి;
కుంభినీచక్రంబున్ = భూమండలమును;
అలవడన్ = అమరిన;
బొమ్మపీట = పీటబొమ్మ;
అని = అని; తలంచున్ = అనుకొనును.
సొలసి =
పారవశ్యముతో;
ఒకమాటు = ఒకసారి;
సుర్య = సుర్యుని;
ఇందు = చంద్రుని;
రోచులన్ =
కాంతులను; అచటి = అక్కడి;
దీప = దీపముల;
కళికలు = కళికలు;
అని = అని; తలంచున్ =
అనుకొనును; భామ = అందగత్తె;
ఒక్కమాటు = ఒకసారి;
భారతీ = సరస్వతీదేవి;
దుర్గలన్ =
పార్వతీదేవిలను;
ఆత్మ = తన యొక్క;
సఖులు = చెలికత్తెలు;
అటంచున్ = అనుకొనుచు;
ఆదరించున్ = ఆదరించును.
తదనంతరంబ = తరవాత.
భావము:
ఒక్కోసారి బ్రహాండం అంతా తన బొమ్మరిల్లుగా లక్ష్మీదేవి భావించేది. ఒకమారు, సకల లోకాలూ ఉండే
బ్రహ్మాండ భాండాలు తన ఇంటిలోని కుండల దొంతరలుగా తలంచేది. బ్రహ్మదేవుడు మొదలగు
దేవతలను తన ఆట బొమ్మలుగా ఒకసారి అనుకునేది. ఒకమాటు భూమండలాన్ని తన బొమ్మల కొలువు
అని భావించేది. సూర్యచంద్రులను అక్కడ ఉండే చిరు దీపాలు అని చూసేది. సరస్వతీదేవిని
పార్వతీదేవిని తన అనుంగు చెలికత్తెలుగా ఆదరించేది.
లక్ష్మీదేవి
అలా అవతరించిన పిమ్మట
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment