8-289-క.
ఆ పాలవెల్లి కూఁతురు
దీపుల చూపులను దోఁగి తిలకింపఁ బ్రజల్
చేపట్టిరి సంపదలనుఁ;
బ్రాపించెను మేలు;
జగము బ్రతికె నరేంద్రా!
8-290-క.
పాలేటి రాచకన్నియ
మే లారెడు
చూపులేక మిడు మిడు కంచున్
జాలిం బురపురఁ బొక్కుచుఁ
దూలిరి రక్కసులు కీడు దోఁచిన నధిపా!
టీకా:
ఆ = ఆ; పాలవెల్లికూతురున్ = లక్ష్మీదేవి;
తీపుల = మాధుర్యముల;
చూపులన్ = చూపులందు;
తోగి = తడిపి; తిలకింపన్ = చూడగా;
ప్రజల్ = లోకులు;
చేపట్టిరి = పొందిరి;
సంపదలన్ =
సంపదలను; ప్రాపించెను = సమకూరెను;
మేలు = శుభములు;
జగమున్ = భువనములు;
బ్రతికెన్ = సుస్థితినిపొందినవి;
నరేంద్రా = రాజా.
పాలేటిరాచకన్నియ =
లక్ష్మీదేవి;
మేలారెడు = మేలుకలిగించెడి;
చూపు = దృష్టి;
లేక = లేకపోవుటచేత;
మిడుమిడుకు = మిడుకుమిడుకు;
అంచున్ = అనుచు;
జాలిన్ = విచారముతో;
పురపురన్ =
పురపురమని; పొక్కుచున్ = దుఃఖించుచు;
తూలిరి = చిన్నబోయిరి;
రక్కసులున్ =
రాక్షసులు; కీడు = అశుభములు;
తోచినన్ = ఉదయించగా;
అధిపా = రాజా.
భావము:
పరీక్షిన్మహారాజా! ఆ సముద్రరాజపుత్రి లక్ష్మీదేవి చల్లని చూపులతో తియ్యగా
చూసింది. ప్రజలకు సంపదలు చేకూరాయి, శుభాలు సమకూరాయి. జగత్తు సుఖజీవనంతో జీవించింది.
ఓ
రాజా! పరీక్షిత్తూ! క్షీరసాగర రాకుమారి అయిన మహాలక్ష్మి శుభకరమైన చూపులు కరువు
అయ్యి రాక్షసులు పరితపించారు. విచారంతో తహ తహ లాడుతూ, జాలితో బుడబుడ
దుఃఖించారు. వారికి కీడు తోచి తూలిపోయారు.
No comments:
Post a Comment