8-283-క.
ఇందీవర దామమున ము
కుందునిఁ బూజించి తనకుఁ గూడి వసింపన్
మందిరముగఁ దద్వక్షము
నందంద సలజ్జదృష్టి నాలోకించెన్.
8-284-ఆ.
మోహరుచుల వలన ముద్దియ దల యెత్తు
సిగ్గువలన బాల శిరము వంచు
నింతి వెఱపు వలన నెత్తదు వంపదు
తనదు ముఖము ప్రాణదయితుఁ
జూచి.
టీకా:
ఇందీవర = కలువల;
దామమునన్ = దండతో;
ముకుందుని = విష్ణుని;
పూజించి = సత్కరించి;
తన = తన; కున్ =
కు; కూడి = చేరి;
వసింపన్ = ఉండుటకు;
మందిరముగన్ = నివాసముగా;
తత్ = అతని;
వక్షమున్ = వక్షస్థలమును;
అందంద = మరీమరీ;
సలజ్జన్ = సిగ్గుతోకూడిన;
దృష్టిన్ =
చూపులతో; ఆలోకించెను = చూసెను.
మోహ =
మిక్కిలిప్రేమ;
రుచుల = ఇచ్చల;
వలన = వలన; ముద్దియ = అందగత్తె;
తల = తలను; ఎత్తున్ = ఎత్తును;
సిగ్గు = లజ్జ;
వలన = వలన; బాల = పిల్ల;
శిరము = తలను;
వంచున్ = దించును;
ఇంతి = స్త్రీ;
వెఱపు = బెరకు;
వలన = వలన; ఎత్తదు =
పైకెత్తదు; వంపదు = కిందకిదింపదు;
తనదు = తన యొక్క;
ముఖమున్ = మోమును;
ప్రాణ =
ప్రాణముతో సమానమైన;
దయితున్ = ప్రియుని;
చూచి = చూసి.
భావము:
లక్ష్మీదేవి కలువపూలమాలతో మోక్షదాయకుడైన విష్ణువు వరించింది. తాను చేరి
నివసించడానికి ఆయన వక్షస్థలాన్ని ఎన్నుకొని, సిగ్గుతో కూడిన చూపులతో మరీ మరీ చూసింది.
ఇందిర
పెల్లుబికిన ప్రేమతో తల ఎత్తింది. కానీ మొలకలెత్తిన సిగ్గుతో తల వంచింది. తన
ప్రాణవల్లభుడైన విష్ణుని చూడడం వలన కలిగిన తొట్రుపాటు వలన ఆమె మోము ఎత్తనూ ఎత్తదు, దించనూ దించదు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment