Monday, August 15, 2016

క్షీరసాగరమథనం – వారిధిఁ

అష్టమ స్కంధమువారుణి ఆవిర్భావము
8-291-క.
వారిధిఁ దరువఁగ నంతట
వారుణి యన నొక్క కన్య చ్చిన నసురుల్
వారిజలోచను సమ్మతి
వారై కైకొనిరి దాని వారిజనేత్రన్.

టీకా:
            వారిధిన్ = సముద్రమును; తరువగన్ = చిలుకగా; అంతటన్ = ఆ తరువాత; వారుణి = వారుణి; అనన్ = అనెడి పేరుగల; ఒక్క = ఒక; కన్య = అందగత్తె; వచ్చినన్ = పుట్టగా; అసురుల్ = రాక్షసులు; వారిజలోచను = విష్ణుని; సమ్మతిన్ = అంగీకారముతో; వారై = వారంతవారే; కైకొనిరి = చేపట్టరి; దానిన్ = ఆమెను; వారిజనేత్రన్ = అందగత్తెను.

భావము:
            పిమ్మట, దేవతలూ రాక్షసులూ పాలసముద్రాన్ని చిలికేటప్పుడు, వారుణి అనే కన్యక పుట్టింది. కలువ కన్నుల విష్ణుమూర్తి అనుమతితో, ఆ కన్యను రాక్షసులు తీసుకున్నారు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: