Wednesday, August 3, 2016

క్షీరసాగరమథనం – కట్టంగఁ బచ్చని

8-271-సీ.
ట్టంగఁ బచ్చని ట్టుఁబుట్టపు దోయి
ముదితకుఁ దెచ్చి సముద్రుఁ డిచ్చె
త్తాళి నికరంబు ధ్వాశ మూఁగిన
వైజయంతీమాల రుణుఁ డిచ్చెఁ
గాంచన కేయూర కంకణ కింకిణీ
టకాదులను విశ్వర్మ యిచ్చె
భారతి యొక మంచి తారహారము నిచ్చె
బాణిపద్మము నిచ్చెఁ ద్మభవుఁడు;
8-271.1-ఆ.
కుండలివ్రజంబు గుండలముల నిచ్చె
శ్రుతులు భద్రమైన నుతులు జేసె
నెల్ల లోకములకు నేలిక సానివై
బ్రతికె దనుచు దిశలు లికె నధిప!
8-272-వ.
మఱియును

టీకా:
            కట్టంగన్ = కట్టుకొనుటకు; పచ్చని = పచ్చటి; పట్టుబట్టపు = పట్టుబట్టల; దోయి = జత; ముదిత = స్త్రీ; కున్ = కి; తెచ్చి = తీసుకొచ్చి; సముద్రుడు = సముద్రుడు; ఇచ్చెన్ = ఇచ్చెను; మత్తాళి = తుమ్మెదల; నికరంబు = గుంపులు; మధువు = పూతేనెపైని; ఆశన్ = ఆశతో; మూగిన = గుంపుగాచేరిన; వైజయంతీమాలన్ = వైజయంతీమాలను; వరుణుడు = వరుణుడు; ఇచ్చెన్ = ఇచ్ఛెను; కాంచన = బంగారపు; కేయూర = దండకడియములు; కంకణ = కంకణములు; కింకిణీ = గజ్జల; కటక = కడిమయులు; ఆదులను = మున్నగువానిని; విశ్వకర్మ = దేవశిల్పియైన విశ్వకర్మ; ఇచ్చెన్ = ఇచ్చెను; భారతి = సరస్వతీదేవి; ఒక = ఒక; మంచి = మేలైన; తారహారమున్ = ముత్యాలహారము; ఇచ్చెన్ = ఇచ్చెను; పాణిపద్మమున్ = చేతిలోకిక్రీడాపద్మము; ఇచ్చెన్ = ఇచ్ఛెను; పద్మభవుడు = బ్రహ్మదేవుడు
            కుండలి = నాగుల; వ్రజంబు = సమూహము; కుండలములన్ = చెవికుండలములను; ఇచ్ఛె = ఇచ్ఛెను; శ్రుతులు = వేదములు; భద్రమైన = మంగళకరమైన; నుతులు = స్తోత్రములను; చేసె = చేసెను; ఎల్ల = సమస్తమైన; లోకముల్ = భువనముల; కున్ = కు; ఏలిక = పరిపాలించెడి; సానివి = అధిపురాలివి; ఐ = అయ్యి; బ్రతికెదు = జీవించెదవు; అనుచున్ = అనుచు; దిశలు = దిక్కులు; పలికెన్ = పలికినవి; అధిప = రాజా.
            మఱియును = ఇంకను.

భావము:
ఓ గొప్పవాడా! పరీక్షిన్మహారాజా! సముద్రుడు కట్టుకోవడానికి పచ్చని పట్టుబట్టల జత లక్ష్మీదేవికి ఇచ్చాడు. వరుణుడు పూతేనెలకోసం మధుకరాలు మూగుతున్న వైజయంతీ మాల సమర్పించాడు. విశ్వకర్మ బంగారపు బాహు పురులూ, కంకణాలూ, కాళ్ళకు గజ్జలు, కడియాలు మున్నగు ఆభరణాలు అందించాడు, బ్రహ్మదేవుడు చేతిలో ఉండే లీలాకమలాన్ని ఇచ్చాడు. నాగరాజులు కర్ణాభరణాలు సమర్పించారు. వేదాలు మంగళకరమైన స్తోత్రాలను సమకూర్చాయి. దిక్కులు “ఎల్ల లోకాలకు ఏలికసానివి అయి జీవించు” అని దీవించాయి.
            అంతే కాదు, సాగరంలో పుట్టిన లక్ష్మీదేవి ఎంతటిది అంటే .


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: