Saturday, August 6, 2016

క్షీరసాగరమథనం – ఆ కన్నులు

8-277-ఆ.
చంచరీకనికర ఝంకార నినదంబు
నరు నుత్పలముల దం పెట్టి
మేఘకోటి నడిమి మెఱుఁగుఁ బుత్తడి మాడ్కి
సురల నడుమ నిల్చె సుందరాంగి.
8-278-క.
 న్నులు నా చన్నులు
నా కురు లా పిఱుఁదు నడుము నా ముఖమా న
వ్యాకారముఁ గని వేల్పులు
చీకాకునఁ బడిరి కలఁగి శ్రీహరి దక్కన్.

టీకా:
            చంచరీక = తుమ్మెదల; నికర = సమూహముల; ఝంకార = ఝుమ్మనియెడి; నినదంబు = శబ్దములతో; తనరు = అతిశయించెడి; ఉత్ఫలముల = పద్మముల; దండ = మాలను; పెట్టి = ధరించి; మేఘ = మబ్బుల; కొటి = సమూహముల; నడిమిన్ = మధ్యలో; మెఱుగు = మెరుపుల; పుత్తడి = బంగారము; మాడ్కిన్ = వలె; సురల = దేవతల; నడుమన్ = మధ్యలో; నిల్చెన్ = ఉండెను; సుందరాంగి = అందగత్తె.
            ఆ = ఆ; కన్నులు = కళ్ళు; ఆ = ఆ; చన్నులున్ = స్తనములు; ఆ = ఆ; కురులున్ = శిరోజములు; ఆ = ఆ; పిఱుదున్ = పిరుదులు; నడుమున్ = నడుము; ఆ = ఆ; ముఖము = మోము; ఆ = ఆ; నవ్య = నుతింపదగిన; ఆకారమున్ = రూపమును; కని = చూసి; వేల్పులు = దేవతలు; చీకాకునన్ = శ్రమము, నలకువ; పడిరి = పొందిరి; కలగి = కలతచెంది; శ్రీహరి = విష్ణుమూర్తి; తక్కన్ = తప్పించి.

భావము:
            ఆ సుందరాంగి ఇందిరాదేవి దేవత లందరి మధ్య, ఝంకారం చేస్తున్న తుమ్మెదలతో కూడిని కలువల దండను చేతులలో పట్టుకుని, మేఘాల నడుమ మెరిసే మెరుపు తీగ వలె (తగిన వరుడిని వరించడానికి) నిలబడింది.
            అపురూపమైన ఆకారం కలిగినామె ఆ మహాలక్ష్మి. నవనవోన్మేషమైన స్వరూపాలు కలిగిన ఆమె కళ్ళు, ఉరోజాలు, శిరోజాలూ, పిరుదులు, నడుము, ముఖము చూసి, ఒక్క శ్రీమహావిష్ణువు తప్ప దేవతలు అందరూ ధైర్యాన్ని కోల్పోయి తబ్బిబ్బు పడ్డారు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: