Thursday, August 11, 2016

క్షీరసాగరమథనం – హరి చూచిన

8-285-క.
రి చూచిన సిరి చూడదు
సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్
రియును సిరియునుఁ దమలో
రిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్.
8-286-చ.
ముల తండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం
 నురమందుఁ దాల్చె; నటఁ త్కరుణారసదృష్టిచేఁ బ్రజల్
గుడఁగఁ దొంటి భంగి నతిమంగళసాధ్వి పతిత్వసంపదన్
నెడిన లోకముల్ గని; నేక శుభంబులఁ బొంది రత్తఱిన్.

టీకా:
            హరి = విష్ణుమూర్తి; చూచినన్ = చూసినచో; సిరి = లక్ష్మీదేవి; చూడదు = చూడదు; సిరి = శ్రీదేవి; చూచినన్ = చూసినచో; హరియున్ = విష్ణువు; చూడన్ = చూచుటకు; సిగ్గునున్ = లజ్జను; పొందును = చెందును; హరియును = విష్ణువు; సిరియునున్ = శ్రీదేవి; తమలోన్ = వారిలోవారు; సరిచూపులన్ = సమానచూపులతో; చూడన్ = చూచుచుండగ; మరుడు = మన్మథుడు; సందడి = తొందర; పెట్టెన్ = పెట్టెను.
            జగముల = లోకములకు; తండ్రి = తండ్రి; ఐ = అయ్యి; తనరు = అతిశయించెడి; శౌరి = విష్ణువు; జగంబుల = లోకములకు; తల్లిన్ = అమ్మను; ఇందిరన్ = లక్ష్మీదేవిని; తగన్ = పూని; ఉరము = వక్షస్థలము; అందున్ = అందు; తాల్చెన్ = ధరించెను; అటన్ = అక్కడ; తత్ = ఆమె; కరుణా = దయా; రస = రసముగల; దృష్టి = చూపు; చేన్ = వలన; ప్రజల్ = లోకులు; మగుడగన్ = మరల; తొంటి = పూర్వము; భంగిన్ = వలెనె; అతి = మిక్కిలి; మంగళ = శుభకరమైన; సాధ్వి = పుణ్య స్త్రీ; పతిత్వ = పతివ్రత; సంపదన్ = సంపదయందు; నెగడిన = అతిశయించిన; లోకముల్ = లోకములు; కనిరి = చూసిరి; అవేక = అనేకమైన; శుభంబులన్ = శుభములను; పొందిరి = పొందిరి; ఆ = ఆ; తఱిన్ = సమయమునందు.

భావము:
            విష్ణుమూర్తి తన కేసి చూస్తే లక్ష్మి చూసేది కాదు. లక్ష్మీదేవి తనని చూస్తే విష్ణువు చూడటానికి సిగ్గు పడేవాడు. లక్ష్మీ విష్ణువు ఒకరినొకరు సరిసమానంగా చూసుకునేలా మన్మథుడు తొందరలు పెట్టాడు.
            లోకాలకు తండ్రి అయిన విష్ణుమూర్తి, లోకాలు తల్లి అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు చేర్చుకున్నాడు. అప్పుడు ఆమె కరుణారస పూరిత చూపులు వలన ప్రజలు ఎన్నో శుభాలను పొందారు. అటువంటి మహా మంగళకరమైన ఆ సాధ్వీమణి పూర్వం వలె భర్తతో చేరిన పుణ్య సంపద వలన లోకాలు పెంపొందాయి.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: