Tuesday, August 2, 2016

క్షీరసాగరమథనం – పండిత సూక్తుల

8-270-క.
పండిత సూక్తుల తోడుతఁ
దుండంబులు చాఁచి తీర్థ తోయములెల్లం
దుంముల ముంచి దిగ్వే
దండంబులు జలక మార్చెఁ రుణీ మణికిన్.

టీకా:
            పండితుల = పండితులయొక్క; సూక్తుల = మంగళాసీస్సుల; తోడుతన్ = తోటి; తుండంబులున్ = తొండములను; చూచి = చాచి; తీర్థ = పుణ్యతీర్థముల; తోయముల్ = నీళ్ళు; ఎల్లన్ = అన్నిటియందు; తుండములన్ = తొండములను; ముంచి = ముంచి; దిగ్వేదండంబులు = దిగ్గజములు; జలకము = స్నానము; ఆర్చెన్ = చేయించెను; తరుణీ = స్త్రీలలో; మణి = రత్నమువంటియామె; కిన్ = కి.

భావము:
            మహా పండితులు మంగళాశీస్సులు పలుకసాగారు. దిగ్గజాలు తొండాలు చాచి పుణ్యతీర్థాల లోని జలాలు తెచ్చి, అన్నులమిన్న అయిన లక్ష్మీదేవికి స్నానం చేయించాయి.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: