Tuesday, September 8, 2015

కాళియ మర్దన - ఇట్లు భోగిభోగ

10.1-646-వ.
ఇట్లు భోగిభోగపరివేష్టితుండై, చేష్టలు లేనివాని తెఱంగునఁ గానంబడుచున్న ప్రాణసఖునిం గనుంగొని తత్ప్రభావంబు లెఱుంగక, తత్సమర్పిత ధనదారమనోరథమానసులు గావున.
          ఇట్లు = ఇలా; భోగి = పాము; భోగ = శరీరముచేత; పరివేష్టింతుండు = చుట్టబడినవాడు; ఐ = అయ్యి; చేష్టలు = అంగచలనములు; లేని = పోయినట్టి; వాని = వాడి; తెఱంగునన్ = విధముగా; కానంబడుచున్న = అగపడుతున్న; ప్రాణసఖునిన్ = ప్రాణస్నేహితుని; కనుంగొని = చూసి; తత్ = అతని; ప్రభావంబులు = మహిమత్వములు; ఎఱుంగక = తెలియక; తత్ = అతని యందే; సమర్పిత = అర్పింపబడినట్టి; ధన = సంపదలు; దార=భార్య; మనోరథ = కోరికలు కల; మానసులు = మనసుకలవారు; కావునన్ = కనుక.
१०.-६४६-.
इट्लु भोगिभोगपरिवेष्टितुंडै, चेष्टलु लेनिवानि तेर्रंगुनँ गानंबडुचुन्न प्राणसखुनिं गनुंगोनि तत्प्रभावंबु लेर्रुंगक, तत्समर्पित धनदारमनोरथमानसुलु गावुन.
            ఇలా ఆ నాగేంద్రుడి పొడవాటి శరీరంచేత చుట్టివేయబడి నిశ్చేష్టు డైనట్లు కృష్ణుడు కనబడుతున్నాడు. అలా పడి ఉన్న తమ ప్రాణస్నేహితుడిని చూసి గోపబాలకులు భయపడ్డారు. వారికి అతని ప్రభావాలు తెలియవు. కాని వారు తమ సంపదలు సంసారాలు కోరికలు మనస్సులు సమర్పించిన వారు కనుక.
            ఆహా ఏమా గోపకుల ప్రపత్తి.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: