10.1-637-వ.
కృతనిశ్చయుండై, పూర్వజన్మ భాగ్యంబునం దన చరణ
సంస్పర్శనంబునకు యోగ్యంబై, తత్సమీపంబున విశాల విటపశాఖా
కదంబంబుతోనున్న కదంబభూజంబు నెక్కి.
కృతనిశ్చయుండు = నిర్ణయించుకొన్నవాడు; ఐ = అయ్యి; పూర్వజన్మ = పూర్వజన్మలందు చేసిన;
భాగ్యంబునన్ = సుకృతములవలన; తన = తన యొక్క; చరణ = పాదముల; సంస్పర్శనంబున్
= చక్కగాసోకుటల; కున్ = కు; యోగ్యంబు =
తగినది; ఐ = అయ్యి; తత్ = ఆ మడుగునకు;
సమీపంబునన్ = దగ్గరలోని; విశాల = పెద్దదైన;
విటప = చిగురించినరెమ్మలు; శాఖా = పెను
కొమ్మలు; కదంబంబున్ = సమూహముల; తోన్ =
తోటి; ఉన్న = ఉన్నట్టి; కదంబ = కడిమి;
భూజంబున్ = చెట్టును; ఎక్కి = ఎక్కినవాడై.
१०.१-६३७-व.
कृतनिश्चयुंडै, पूर्वजन्म भाग्यंबुनं दन चरण संस्पर्शनंबुनकु योग्यंबै, तत्समीपंबुन विशाल विटपशाखा
कदंबंबुतोनुन्न कदंबभूजंबु नेक्कि.
ఆ దగ్గరలో
ఒక కడిమి చెట్టుంది. అది పూర్వజన్మ భాగ్యం చేత శ్రీకృష్ణుని పాదస్పర్శకు నోచిన
చెట్టు. దానికి విశాల మైన కొమ్మ లున్నాయి. ఆ చెట్టు మీదకు కృతనిశ్చయుడైన కృష్ణుడు
ఎక్కాడు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment