10.1-648-క.
గోపకుమారకశేఖరు
నేపున
సర్పంబు గఱచు టీక్షించి
వగన్
మేపులకుఁ
దొలఁగి గోవులు
వాపోవుచునుండె
వృషభవత్సంబులతోన్.
గోప = గొల్ల; కుమార =
పిల్లలలో; శేఖరున్ = శ్రేష్ఠుని; ఏపునన్
= గర్వముతో; సర్పంబున్ = పాము; కఱచుటన్
= కరిచివేయుటను; ఈక్షించి = చూసి; వగన్
= విచారముతో; మేపుల్ = గడ్డిమేయుటల; కున్
= కు; తొలగి = మాని; గోవులు = ఆవులు;
వాపోవుచున్ = ఏడ్చుచును; ఉండెన్ = ఉండెను;
వృషభ = ఎద్దులు; వత్సంబుల
= దూడల; తోన్ = తోటి.
१०.१-६४८-क.
गोपकुमारकशेखरु
नेपुन सर्पंबु
गर्रचु टीक्षिंचि वगन्
मेपुलकुँ दोलँगि
गोवुलु
वापोवुचुनुंडे
वृषभवत्संबुलतोन्.
అక్కడి
ఆవులు, దూడలు, ఎద్దులు గోపబాలకులలో
శ్రేష్ఠుడైన ఆ కృష్ణుని నాగరాజు బలంగా కాటువేయటం చూసాయి; అవి
అన్నీ విచారంతో మేతమేయడం మానేసి దుఃఖిస్తున్నాయి;
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment