10.1-638-మ.
కటిచేలంబు
బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ
గీలించి త
త్కుటశాఖాగ్రము
మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు
ది
క్తటముల్
మ్రోయ హ్రదంబులో గుభగుభధ్వానం బనూనంబుగన్.

१०.१-६३८-म.
कटिचेलंबु बिगिंचि पिंछमुनँ जक्कं गोप्पु बंधिंचि दो
स्तट संस्फालन माचरिंचि चरणद्वंद्वंबुँ गीलिंचि त
त्कुटशाखाग्रमु मीँदनुंडि युर्रिकेन् गोपालसिंहंबु दि
क्तटमुल् म्रोय ह्रदंबुलो
गुभगुभध्वानं बनूनंबुगन्.
నడుముకున్న
దట్టీగుడ్డని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. తలవెంట్రుకల కొప్పు నెమలి పింఛంతో
బిగించి కట్టుకున్నాడు. రెండు చేతులతో భుజాలు చరచాడు. రెండుకాళ్ళు కీళ్ళు బిగించి సింహపరాక్రమశాలి
గోపాలబాలుడు ఆ చెట్టు కొమ్మ మీదనుంచి కాళింది మడుగులోకి కుప్పించి దూకాడు. దూకిన
వేగానికి గుభీలు మని పెద్ద శబ్దం వచ్చింది. దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment