Wednesday, September 16, 2015

కాళియ మర్దన - కట్టా


10.1-656-క.
ట్టా! క్రూర భుజంగము
ట్టలుకన్ నిన్నుఁ గఱవఁ గంపించితివో
తిట్టితివో పాపపు విధిఁ
ట్టి మముం దలఁచి కాఁక లవించితివో?
          కట్టా = అయ్యో; క్రూర = క్రూరమైన; భుజంగము = పాము; కట్ట = గట్టి; అలుకన్ = కోపముతో; నిన్నున్ = నిన్ను; కఱవన్ = కరచుటచేత; కంపించితివో = వణికిపోతివేమో; తిట్టితివో = తిట్టనావేమో; పాపపు = పాపిష్టి; విధిన్ = దైవమును; పట్టి = పట్టుకొని; మమున్ = మమ్ము; తలచి = తలచుకొని; కాకన్ = పరితాపముతో; పలవించితివో = విలపించితివో.
१०.१-६५६-क.
कट्टा! क्रूर भुजंगमु
गट्टलुकन् निन्नुँ गर्रवँ गंपिंचितिवो?
तिट्टितिवो पापपु विधिँ?
बट्टि ममुं दलँचि काँक पलविंचितिवो?
            అయ్యయ్యో! క్రూరమైన ఆ పాము కోపంతో నిన్ను కాటువేస్తుంటే భయంతో ఎంత వణికిపోయావో? ఆ పాపిష్ఠి విధిని ఎంతగా తిట్టుకొన్నావో? మమ్మల్ని తలచుకొని బాధతో ఎంతగా పలవరించావో కదా!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: