Saturday, September 19, 2015

కాళియ మర్దన - శ్రవణరంధ్రంబులు

10.1-659-సీ.
శ్రవణరంధ్రంబులు ఫలతఁ బొందంగనెలమి భాషించు వా రెవ్వ రింకఁ
రచరణాదుల లిమి ధన్యత నొందనెరిగి పైఁ బ్రాఁకు వా రెవ్వ రింక
యనయుగ్మంబు లున్నతిఁ గృతార్థములుగానవ్వులు చూపు వా రెవ్వ రింక
జిహ్వలు గౌరవశ్రీఁ జేరఁ బాటలయెడఁ బలికించు వా రెవ్వ రింక
10.1-659.1-ఆ.
తండ్రి! నీవు సర్పష్టుండవై యున్న; నిచట మాకుఁ బ్రభువు లెవ్వ రింక
రిగి పాయ లేముమాకు నీతోడిద; లోక మీవు లేని లోక మేల?"
            శ్రవణ = చెవి; రంధ్రంబులున్ = కన్నములు; సఫలతన్ = ధన్యము; పొందంగన్ = పొందునట్లు; ఎలమిన్ = ప్రీతితో; భాషించు = మాట్లాడెడి; వారు = వాళ్ళు; ఎవ్వరు = ఎవరు; ఇకన్ = ఇకపైన; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆదులన్ = మొదలగునవి; కలిమిన్ = కలుగుటచేత; ధన్యతన్ = కృతార్థత్వము; ఒందన్ = పొందగా; ఎగిరి = మీదికి దూకి; పైన్ = మామీదకు; ప్రాకు = పాకెడి; వారు = వారు; ఎవ్వరు = ఎవరు; ఇంక = ఇకమీద; నయన = కళ్ళ; యుగ్మంబులు = జంటలు; ఉన్నతిన్ = అతిశయముతో; కృతార్థములుగా = ధన్యమగునట్లు; నవ్వులు = నవ్వులను; చూపు = కనపరచువారు; వారు = వారు; ఎవ్వరు = ఎవరు; ఇంక = ఇకమీద; జిహ్వలు = నాలుకలు; గౌరవ = మన్నల; శ్రీన్ = సంపదలను; చేరన్ = చేరునట్లుగా; పాటల = పాటల; ఎడల = అందు; పరికించు = చూచెడివారు; వారు = వారలు; ఎవ్వరు = ఎవరు; ఇంకన్ = ఇకపైన.
            తండ్రి = నాయనా; నీవు = నీవు; సర్ప = పాముచే; దష్టుండవు = కాటువేయబడినవాడవు; ఐ = అయ్యి; ఉన్నన్ = ఉండగా; ఇచటన్ = ఇక్కడ; మా = మా; కున్ = కు; ప్రభువులు = విభులు; ఎవ్వరు = ఎవరు; ఇంకన్ = ఇకపైన; మరిగి = మాలిమిగలవారమై; పాయలేము = ఎడబాయలేము; మా = మా; కున్ = కు; నీ = నీ; తోడిద = తోమాత్రమే; లోకము = లోకము; ఈవు = నీవు; లేని = లేనట్టి; లోకము = ప్రపంచము; ఏల = ఎందుకు.      
१०.१-६५९-सी.
श्रवणरंध्रंबुलु सफलतँ बोंदंग; नेलमि भाषिंचु वा रेव्व रिंकँ?
गरचरणादुल कलिमि धन्यत नोंद; नेरिगि पैँ ब्राँकु वा रेव्व रिंक?
नयनयुग्मंबु लुन्नतिँ गृतार्थमुलुगा; नव्वुलु चूपु वा रेव्व रिंक?
जिह्वलु गौरवश्रीँ जेरँ बाटल; येडँ बलिकिंचु वा रेव्व रिंक
१०.१-६५९.१-आ.
तंड्रि! नीवु सर्पदष्टुंडवै युन्न; निचट माकुँ ब्रभुवु लेव्व रिंक?
मरिगि पाय लेमु; माकु नीतोडिद; लोक मीवु लेनि लोक मेल?"
              చిన్ని నా తండ్రీ! మా చెవులున్నందుకు సార్థకమయ్యేలా ఉత్సాహంగా ఇంక మాతో ఎవరు మాట్లాడతారు? కాళ్ళు చేతులు ఉన్నందుకు సార్థక మయ్యేలా మా మీదకి దూకి ఇంకెవరు ఎగబాకుతారు? మా కళ్ళు సార్థక మయ్యెలా ఇంక ఎవరు చిరునవ్వులు చిలుకుతారు? మా నాలుకలు కృతార్థత పొందేలా ఇంక మాచేత పాటలు ఎవరు పాడిస్తారు? నాయనా! నువ్విలా పాముకాటు పాల పడిపోతే, ఇక్కడ మమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉన్నారు? నీ ప్రేమ రుచి మరిగిన వాళ్ళం. నిన్ను విడిచి వెళ్ళి పోలేము. మాకు నీతోడిదే లోకం. నువ్వు లేని ఈ లోకం మా కెందుకు?”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: