10.1-640-శా.
పాఠీనాకృతిఁ దోయరాశినడుమన్ భాసిల్లి మున్నాఢ్యుఁడై
కాఠిన్యక్రియ
నీదునేర్పు దనకుం గల్మిన్
భుజంగేంద్ర హృ
త్పీఠాగ్రంబున
రోషవహ్ను లెగయన్ భీమంబుగా
నీదె ను
ల్లోఠోత్తుంగతరంగమై
మడుఁగు దుర్లోక్యంబుగా బాహులన్.
పాఠీన = చేప (మత్స్యావతారం); ఆకృతిన్ = రూపముతో;
తోయరాశిన్ = సముద్రము {తోయరాశి - తోయము (నీరు)
రాశిగా కలది, కడలి}; నడుమన్ = మధ్యలో;
భాసిల్లి = ప్రకాశించి; మున్ను = పూర్వము;
ఆఢ్యుడు = సుసంపన్నముగా కలవాడు; ఐ = అయ్యి;
కాఠిన్య = కఠినమైనట్టి; క్రియన్ = విధముగా;
ఈదు = ఈదెడి; నేర్పు =
ప్రావీణ్యము; తన = అతని; కున్ = కి;
కల్మిన్ = ఉండుటచేత; భుజగ = పాములకు; ఇంద్ర = రాజు యొక్క; హృత్
= హృదయము; పీఠ = మూలముల; అగ్రమునన్ = చివర్లవరకు;
రోష = కోపము అనెడి; వహ్నులు = అగ్నులు;
ఎగయన్ = వ్యాపించగా; భీమంబుగాన్ = భయంకరముగా;
ఈదెన్ = ఈదెను; ఉల్లోఠ = కల్లోలమైన; ఉత్తుంగ = ఎత్తైన; తరంగము = అలలుకలది; ఐ = అయ్యి; మడుగు = హ్రదము; దుర్లోక్యంబు
= చూడశక్యముకానిది; కాన్ = అగునట్లు; బాహులన్
= చేతులతో.
१०.१-६४०-शा.
पाठीनाकृतिँ दोयराशिनडुमन् भासिल्लि मुन्नाढ्युँडै
काठिन्यक्रिय नीदुनर्पु दनकुं गल्मिन् भुजंगेंद्र हृ
त्पीठाग्रंबुन रोषवह्नु लेगयन् भीमंबुगा नीदे नु
ल्लोठोत्तुंगतरंगमै मडुँगु दुर्लोक्यंबुगा बाहुलन्.
హరికి మత్యావతారం
ఎత్తినప్పుడు సముద్ర మధ్యలో భీకరంగా విహరిస్తు ఈదడంలో ఇంతకు ముందే అభ్యాసం అయింది
కదా. కనుక ఇప్పుడు కృష్ణావతారంలో ఆ మడుగు అల్లకల్లోలమై ఉవ్వెత్తున అలలు లేచేలా తన
చేతులతో చూడశక్యంకానంత భయంకరంగా కలచివేస్తు ఈదుతున్నాడు. దానితో మడుగులో ఉన్న
కాళియ నాగరాజు గుండెల్లో రోషాగ్ని జ్వాలలు ఎగసాయి.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment