10.1-670-క.
ఈతఁడు
సర్వచరాచర
భూతేశుండైన
పరమపురుషుఁడు సేవా
ప్రీతుఁడు
శ్రీహరి యగు" నని
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి
నృపా!
ఈతడు = ఇతను; సర్వ =
సమస్తమైన; చర = కదలగల; అచర = కదలలేని;
భూత = జీవులకు; ఈశుండు = ప్రభువు; ఐన = అగు; పరమ = అత్యుత్తమ; యోగి
= యోగియైన; పురుషుడు = వాడు; సేవా =
భక్తులయందు; ప్రీతుడు = ప్రీతిగలవాడు; శ్రీహరి
= విష్ణుమూర్తి {హరి - సుషుప్తి మరియు ప్రళయ కాలములందు సర్వమును
తన యందు లయము చేసుకొని సుఖరూపమున నుండువాడు, విష్ణువు};
అగును = అగును; అని = అని; భీతిన్ = భయముతో; శరణంబు = శరణు; ఒందెన్ = చొచ్చెను; బిట్టు = మిక్కిలి; అలసి = అలసిపోయి; నృపా = రాజా.
१०.१-६७०-क.
ईतँडु सर्वचराचर
भूतेशुंडैन
परमपुरुषुँडु सेवा
प्रीतुँडु श्रीहरि
यगु" ननि
भीतिन् शरणंबु
नोंदे बिट्टलसि नृपा!
విష్ణుమూర్తి
సమస్త చరాచర జీవులకు ప్రభువు, పరమ పురుషుడు, పరమయోగి, భక్తితోసేవిస్తే సంతోషించేవాడు. ఇంతటి ఈ
పిల్లాడు ఆ శ్రీహరే అయ్యి ఉంటాడు.” అనుకున్నాడు కాళియుడు. రాజా! మిక్కలి భయంతో,
అలసటతో అతడు కృష్ణుని శరణు కోరాడు.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment