Monday, September 7, 2015

కాళియ మర్దన - కఱచి

10.1-645-క.
చి పిఱుతివక మఱియును
వెవక నిజవదనజనిత విషదహనశిఖల్
మెయఁ దన నిడుద యొడలిని
నెఱి హరిఁ బెనగొనియె భుజగనివహపతి వడిన్.
          కఱచి = కరిచి; పిఱుతివక = ఆగక; మఱియును = పిమ్మట; వెఱవక్ = బెదరక; నిజ = తన యొక్క; వదన = ముఖములనుండి; జనిత = పుట్టిన; విష = విషము అనెడి; దహన = అగ్ని; శిఖల్ = మంటలు; మెఱయన్ = ప్రకాశించుచుండగ; తన = తన యొక్క; నిడుద = పొడుగైన; ఒడలిని = శరీరముతో; నెఱిన్ = పూర్తిగా; హరిన్ = కృష్ణుని; పెనగొనియెన్ = పెనవేసుకొనెను; భుజగ = పాముల; నివహ = సమూహములకు; పతి = రాజు; వడిన్ = వేగముగా.
१०.१-६४५-क.
कर्रचि पिर्रुतिवक मर्रियुनु
वेर्रवक निजवदनजनित विषदहनशिखल्
मेर्रयँ दन निडुद योडलिनि
नेर्रि हरिँ बेनगोनिये भुजगनिवहपति वडिन्.
            కాటేసిన కాళియ నాగరాజు అంతటితో ఊరుకోలేదు. నదురు బెదురు లేకుండ తన పొడవైన శరీరంతో కృష్ణుడిని అతి వేగంగా పెనవేసుకొని గట్టిగా బంధించాడు. పైకి ఎత్తిపెట్టిన తన పడగల నోళ్ళనుండి విషాగ్నిజ్వాలలు మెరిపిస్తున్నాడు.
            ఎంతో మధుర గంభీరమైన పద్యమిది. సర్వలఘు కందం. 2వ, 4వ పాదాంతాలలో ఛందోనియమం కనుక తప్పనిసరై గురువులు (U) వాడి మిగతా అక్షరాలు అన్నీ లఘువులు(I) వాడారు. ప్రాసాక్షర ప్రయోగించి, ఇంకా పైన మరి రెండు ఱకారాలు ప్రయోగించి వృత్యనుప్రాస పండించారు. పోతన్నగారికి ప్రణామాలు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: