10.1-657-క.
పన్నగము
మమ్ముఁ గఱవక
నిన్నేటికిఁ
గఱచెఁ గుఱ్ఱ! నెమ్మి
గలిగి నీ
వున్నను మము
రక్షింతువు;
నిన్నున్ రక్షింప నేము నేరము
తండ్రీ!
పన్నగము = పాము; మమ్మున్
= మమ్మలను; కఱవకన్ = కరవకుండ; నిన్నున్
= నిన్ను; ఏటికిన్ = ఎందుకు; కఱచెన్ = కరిచినది;
కుఱ్ఱ = పిల్లవాడ; నెమ్మి = క్షేమము; కలిగి = ఉన్నవాడవు; నీవు = నీవు; ఉన్నను = ఉంటేచాలు; మమున్ = మమ్ములను; రక్షింతువు = కాపాడెదవు; నిన్నున్ = నిన్ను; రక్షింపన్ = కాపాడుటకు; ఏము = మేము; నేరము = శక్తులముకాము; తండ్రీ = అయ్యా.
१०.१-६५७-क.
पन्नगमु मम्मुँ गर्रवक
निन्नेटिकिँ गर्रचेँ गुर्र्र्र! नेम्मि गलिगि नी
वुन्ननु ममु रक्षिंतुवु;
निन्नुन् रक्षिंप नेमु नेरमु तंड्री!
ఓ కన్నతండ్రీ! ఈ పాపిష్ఠి పాము మమ్మల్ని కరవకుండ నిన్నెందుకు కరచిందయ్యా? నువ్వు క్షేమంగా ఉంటే మమ్మల్ని రక్షిస్తావు. కాని నువ్వు ఆపదలో ఉంటే మేము నిన్ను రక్షించగల వారము కాదు కదయ్యా!

: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment