10.1-643-వ.
అని తలంచి విజృంభించి.
10.1-644-ఉ.
ఘోరవిషానలప్రభలు గొబ్బునఁ
గ్రమ్మఁగ సర్పసైన్య వి
స్ఫారుఁడు
గాళియోరగుఁడు పాఱివడిం
గఱచెన్ పయోధరా
కారుఁ బయోవిహారు భయకంప విదూరు
మహాగభీరు నా
భీరకుమారు
వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్.
అని = అని; తలంచి =
అనుకొని; విజృంభించి = రెచ్చిపోయి.
ఘోర = అతిభయంకరమైన; విష =
విషము అనెడి; అనల = అగ్ని; ప్రభలు =
కాంతులు; గొబ్బునన్ = శీఘ్రముగా; క్రమ్మగన్
= కమ్ముకొనగా; సర్ప = పాముల; సైన్య =
దండు; విస్ఫారుడు = అధికముగా కలవాడు; కాళియ
= కాళియుడు అనెడి; ఉరగుడు = సర్పము; పాఱి
= పరుగెత్తుకెళ్ళి; వడిన్ = వేగముగా; కఱచెన్
= కరచెను; పయోధరాకారున్ = కృష్ణుని {పయోధరాకారుడు
- పయోధరము (మేఘముల వలె) నల్లని ఆకారుడు (దేహము కలవాడు), కృష్ణుడు};
పయస్ = నీటియందు; విహారున్ = ఈదుతున్నవానిని;
భయ = భయము; కంప = బెరుకులు; విదూరున్ = లేనివానిని; మహా = గొప్ప; గభీరున్ = గంభీరమైనవానిని; ఆభీర = యాదవ; కుమారున్ = బాలుని; వీరున్ = శూరుడుని; నవ = కొత్త; పీత = పచ్చని; శుభ
= మంచి; అంబర = బట్టలు; ధారున్ = ధరించినవానిని;
ధీరున్ = ధైర్యశాలిని.
१०.१-६४४-उ.
घोरविषानलप्रभलु गोब्बुनँ ग्रम्मँग सर्पसैन्य वि
स्फारुँडु गाळियोरगुँडु पार्रिवडिं गर्रचेन् पयोधरा
कारुँ बयोविहारु भयकंप विदूरु महागभीरु ना
भीरकुमारु वीरु नवपीत शुभांबरधारु धीरुनिन्.
ఇలా అనుకుని కాళియుడు విజృంభించాడు.
తన సైన్యం
అంతటితోనూ కృష్ణుడి దగ్గరకు పరుగెట్టు కెళ్ళాడు సర్పరాజు; తన
ఘోరమైన విషాగ్ని జ్వాలల కాంతులు గుప్పుమని కమ్ముకుంటు ఉండగా, కృష్ణుడిని పెద్దగా కాటువేసాడు; ఆ బాలుడు నీలమేఘం వలె
శ్యామ వర్ణుడు; భయం, బెరుకు, వణుకు ఏ మాత్రం లేనివాడు; మహాగంభీరుడు; మిక్కలిధైర్యవంతుడు. గొప్పవీరుడు; బంగారు రంగుగల శుభకరమైన
కొత్త పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు; అటువంటి కృష్ణుడు ఆ
కాళింది నీళ్ళలో ఇష్టంవచ్చి నట్లు ఈదుతున్నాడు;
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment