10.1-639-ఉ.
భూరి మహాప్రతాప పరిపూర్ణ
భయంకర గోపబాల కం
ఠీరవపాతవేగవికటీకృత
దుర్విషభీషణోర్మి సం
పూరితమై వడిం
గలఁగి పొంగి
ధనుశ్శతమాత్రభాగ వి
స్తారము పొందె
నమ్మడుఁగు తప్తపయఃకణ
బుద్బుదోగ్రమై.

१०.१-६३९-उ.
भूरि महाप्रताप परिपूर्ण भयंकर गोपबाल कं
ठीरवपातवगविकटीकृत दुर्विषभीषणोर्मि सं
पूरितमै वडिं गलँगि पोंगि धनुश्शतमात्रभाग वि
स्तारमु पोंदे नम्मडुँगु तप्तपयःकण बुद्बुदोग्रमै.
మిక్కిలి
గొప్ప ప్రతాపంతో నిండిన భీకరమైన సింహకిశోరం లాంటి ఆ గొల్లపిల్లాడు గభాలున దూకాడు.
ఆ విపరీత వేగానికి ఆ సరస్సు దుర్విషంతో కూడిన భీకరమైన అలలుతో నిండి, వడితో కలచివేయబడింది. నీళ్ళు వికట నృత్యం చేస్తు పైకి నూరు ధనుస్సుల ఎత్తు
పొంగి కుత కుతలాడుతున్న నీటి బుడగలు లేచాయి.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment