10.1-649-క.
భూతలము
వడఁకె నుల్కా
పాతంబులు
మింటఁ గానబడె ఘోషములో
వ్రేతలకును
గోపక సం
ఘాతములకు
నదరె గీడుకన్ను లిలేశా!
భూతలము = భూమండలము; వడకెన్
= వణికిపోయినది, కంపించె; ఉల్కా =
ఉల్కలు; పాతంబులున్ = పడుటలు; మింటన్ =
ఆకాశమునందు; కానబడెన్ = అగపడెను; ఘోషము
= మంద; లోన్ = అందు; వ్రేతల = గోపికుల;
కును = కు; గోపక = గోపకుల; సంఘాతముల = సమూహముల; కున్ = కి; అదరెన్ = అదిరినవి; కీడు = చెడుసూచించు {కీడుకన్ను - మగవారికి ఎడమకన్ను స్త్రీలకు కుడికన్ను}; కన్నులు = కళ్ళు; ఇలేశా = రాజా {ఇలేశుడు - ఇల (భూమి)కి ఈశుడు, రాజు}.
१०.१-६४९-क.
भूतलमु वडँके नुल्का
पातंबुलु मिंटँ गानबडे घोषमुलो
व्रेतलकुनु गोपक सं
घातमुलकु नदरे गीडुकन्नु लिलेशा!
మహారాజా! అలా
కాళియుడు కృష్ణుని కాటువేసిన సమయంలో, భూమి కంపించింది.
ఆకాశంలో ఉల్కలు కనబడ్డాయి. గోకులంలోని గొల్లలకు ఎడం కన్ను, గోపికలకు
కుడికన్ను అశుభ సూచకంగా అదిరాయి.
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment