Saturday, September 12, 2015

కాళియ మర్దన

10.1-651-క.
వారిబ్భంగి నెఱుంగని
వారై హరిఁ జూడఁబోవ డిగొని నగుచున్
వారింపఁ డయ్యె రాముఁడు
వారిని హరి లా వెఱుంగువాఁ డయ్యు నృపా!
          వారు = ఆ గోపకులు; ఈ = ఈ; భంగిన్ = ప్రకారముగా; ఎఱుంగని = తెలియని; వారు = వారు; ఐ = అయ్యి; హరిన్ = కృష్ణుని; చూడబోవన్ = వెతకుటకుపోవుచుండగ; వడిగొని = మిక్కిలిగా; నగుచున్ = నవ్వుతు; వారింపడు = అడ్డగింపనివాడు; అయ్యెన్ = అయ్యెను; రాముడు = బలరాముడు; వారిని = వారిని; హరి = కృష్ణుని; లావు = శక్తి; ఎఱుంగువాడు = తెలిసినవాడు; అయ్యున్ = అయినప్పటికి; నృపా = రాజా.
10.1-651-ka.
vaaribbhaMgi neRruMgani
vaarai hariM~ jooDaM~bova vaDigoni naguchun
vaariMpaM~ Dayye raamuM~Du
vaarini hari laa veRruMguvaaM~ Dayyu nRipaa!
            బలరాముడు కృష్ణుడి శక్తి తెలిసిన వాడు అయినప్పటికి, గోకులంలోని వారందరు అజ్ఞానంతో కృష్ణుడి జాడ కోసం అలా వేగంగా పోతుంటే చూసి కూడా వారిని ఆపలేదు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

1 comment:

Therithal Information Service said...
This comment has been removed by a blog administrator.