10.1-641-వ.
ఆ సమయంబున.
10.1-642-శా.
"బాలుం డొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ క
ల్లోలంబై కలఁగం
జరించె నిట నే లోనుంటఁ
జూడండు; మ
త్కీలాభీలవిశాలదుస్సహవిషాగ్నిజ్వాలలన్
భస్మమై
కూలంజేసెద
నేడు లోకులకు నా కోపంబు
దీపింపఁగన్."
ఆ = ఆ యొక్క; సమయంబునన్ = సమయంమునందు.
బాలుండు = పిల్లవాడు; ఒక్కడు
= ఒకానొకడు; వీడు = ఇతడు; నా = నా
యొక్క; మడుగున్ = హ్రదమును; విభ్రాంత =
విభ్రాతికరమైన; ఉచ్చలత్ = మిక్కిలిచలించిన; కీర్ణ = అంతట వ్యాపించిన; కల్లోలంబు = గొప్ప అలలుకలది; ఐ = అయ్యి; కలగన్
= కలిగిపోవునట్లు; చరించెన్ = మెలగెను; ఇట = ఇక్కడ; నేన్ = నేను; లోన్
= లోపల; ఉంటన్ = ఉండుటను; చూడండు =
లెక్కజేయడు; మత్ = నా యొక్క; కీలా =
మంటలచేత; అభీల = భయంకరమైన; విశాల = విస్తారమైన;
దుస్సహ = సహింపలేని; విష = విషము అనెడి;
అగ్ని = అగ్ని; జ్వాలలన్ = మంటలందు; భస్మము = బూడిద; ఐ = అయిపోయి; కూలన్
= పడిపోవునట్లు; చేసెదన్ = చేసెదను; నేడు
= ఇవాళ; లోకుల్ = లోకములోని అందర; కున్
= కి; నా = నా యొక్క; కోపంబు = రోషము;
దీపింప = ప్రకాశించినది; కన్ = అగునట్లు.
१०.१-६४२-शा.
"बालुं डोक्कँडु वीँडु ना मडुँगु
विभ्रांतोच्चलत्कीर्ण क
ल्लोलंबै कलँगं जरिंचे निट न लोनुंटँ जूडंडु; म
त्कीलाभीलविशालदुस्सहविषाग्निज्वाललन् भस्ममै
कूलंजेसेद नेडु लोकुलकु ना कोपंबु दीपिंपँगन्."
అప్పుడు
ఆ
కాళియుడు ఇలా అనుకున్నాడు “వీడెవడో ఒక కుర్రాడు నా మడుగును
కల్లోలం చేసి కలచివేస్తున్నాడు. ఎగిసి పడుతున్న అలలతో కళ్ళుచెదిరేలా ఈదేస్తూ
ఉన్నాడు. లోపల నేను ఉన్నాననేనా చూడటంలేదు. భయంకరమైన భరింపశక్యంకాని నా
విషాగ్నిజ్వాలలతో భస్మంచేసి వీడిని కూల్చేస్తాను. లోకు లందరికి నా కోపం ఎలాంటిదో తెలిసిరావాలి.”
: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment