10.1-669-ఉ.
"వేలుపులైన
లావుచెడి వేదనఁ
బొందుచు నా విషానల
జ్వాలలు
సోఁకినంతటన చత్తురు; నేడిది యేమి చోద్య? మా
భీలవిషాగ్ని
హేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ
బాలుఁడు
మత్ఫణాశతము భగ్నముగా
వెసఁ ద్రొక్కి యాడెడున్.
వేలుపులు = దేవతలు; ఐనన్
= అయినను; లావు = శక్తి; చెడి = నశించి;
వేదనన్ = సంకటమును; పొందుచున్ = పొందుచు;
నా = నా యొక్క; విష = విషము అనెడి; అనల = అగని; జ్వాలలు = మంటలు; సోకినన్
= తాకిన; అంతటనన్ = మాత్రముచేతనే; చత్తురు
= చనిపోయెదరు; నేడు = ఇవాళ; ఇది = ఇది;
ఏమి = ఏమిటి; చోద్యము = విచిత్రము; ఆభీల = భయంకరమైన; విష = విషమనెడి; అగ్ని = అగ్నిచేత; హేతి = దెబ్బల; చయ = అనేకము యొక్క; పీడ = బాధ; కున్ = కు; ఓర్చియున్ = తట్టుకొనుటేకాక; క్రమ్మఱంగ = మరల; ఈ = ఈ యొక్క; బాలుడు = చిన్నపిల్లవాడు; మత్ = నా యొక్క; ఫణా = పడగల; శతమున్ = నూటిని, సమూహమును;
భగ్నము = నలిగిపోయినవి; కాన్ = అగునట్లు; వెసన్ = వేగముగా; త్రొక్కి
= తొక్కి; ఆడెడున్ = నృత్యముచేస్తున్నాడు.
१०.१-६६९-उ.
"वेलुपुलैन लावुचेडि वेदनँ बोंदुचु ना विषानल
ज्वाललु सोँकिनंतटन चत्तुरु; नेडिदि येमि चोद्य? मा
भीलविषाग्नि हेतिचयपीडकु नोर्चियुँ ग्रम्मर्रंग नी
बालुँडु मत्फणाशतमु भग्नमुगा वेसँ द्रोक्कि याडेडुन्.
“నా విషాగ్ని జ్వాలలు సోకితే చాలు, దేవతలైనా సరే శక్తి నశించిపోయి గిలగిలకొట్టుకొని చచ్చిపోతారు. అలాంటిది ఇవేళ ఈ బాలుడు క్రూరమైన నావిషాగ్ని జ్వాలల తాకిడి ధాటికి తట్టుకొన్నాడు. పైగా నా నూరు పడగలను చితకతొక్కేస్తూ నాట్యంచేసేస్తున్నాడు కూడ. ఇదేమి విచిత్రమో?

: :చదువుకుందాం
భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment