Saturday, September 5, 2015

శ్రీ కృష్ణాష్టమీ శుభాకాంక్షలు.


మా నల్లనయ్య మన అందరికి సకల సుఖ-సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు అనుగ్రహించు గాక.
10.1-112-సీ.
లధరదేహు నాజానుచతుర్బాహురసీరుహాక్షు విశాలవక్షుఁ
జారు గదా శంఖ క్ర పద్మ విలాసుఁగంఠకౌస్తుభమణికాంతిభాసుఁ
మనీయ కటిసూత్ర కంకణ కేయూరు; శ్రీవత్సలాంఛనాంచిత విహారు
నురుకుండలప్రభాయుత కుంతలలలాటు; వైడూర్యమణిగణ రకిరీటు 
10.1-112.1-తే.
బాలుఁ బూర్ణేందురుచిజాలు క్తలోక; పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది; యుబ్బి చెలరేఁగి వసుదేవు డుత్సహించె.
టీకా:
బాలున్ = చిన్నపిల్లవానిని; పూర్ణ = నిండు; ఇందు = జాబిల్లి; రుచి = మెరుపులు; చాలు = చాలాకలవానిని; భక్త = భక్తులు; లోక = అందరను; పాలున్ = కాపాడువానిని; సుగుణ = మంచిగుణములకు {సుగుణములు - శమము దమము శాంతము సర్వజ్ఞత్వము మున్నగు మంచిగుణములు}; అలవాలము = ఉనికిపట్టైనవానిని; చూచి = కనుగొని; తిలకించి = చూసి; పులకించి = సంతోషించి; చోద్యమంది = అబ్బురపడి; ఉబ్బి = ఉప్పొంగి; చెలరేగి = విజృంభించి; వసుదేవుడు = వసుదేవుడు; ఉత్సహించెన్ = ఉత్సాహముచెందెను.
10.1-112-see.
jaladharadehu naajaanuchaturbaahu; saraseeruhaakShu vishaalavakShuM~
jaaru gadaa shaMkha chakra padma vilaasuM~; gaMThakaustubhamaNikaaMtibhaasuM~
gamaneeya kaTisootra kaMkaNa keyooru; shreevatsalaaMchhanaaMchita vihaaru
nurukuMDalaprabhaayuta kuMtalalalaaTu; vaiDooryamaNigaNa varakireeTu
10.1-112.1-tE.
baaluM~ boorNeMduruchijaalu bhaktaloka; paalu suguNaalavaaluM~ gRipaavishaaluM~
joochi tilakiMchi pulakiMchi chodya maMdi; yubbi chelareM~gi vasudevu DutsahiMche.
భావము:
ఆ బాలుడు దివ్యరూపంతో వసుదేవునికి దర్శనమిచ్చాడు. అతడు నీలమేఘ వర్ణ దేహం కలిగి ఉన్నాడు; (మోకాళ్ళ వరకు) పొడవైన నాలుగు చేతులలో గద శంఖం చక్రం పద్మం వెలుగొందుతున్నాయి; తామరరేకుల వంటి కళ్ళు, విశాలమైన వక్షం ఉన్నాయి; కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగుతున్నాయి; అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది; చెవికుండలాల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి; వైడూర్య మణులు పొదగిన కిరీటం ధరించి ఉన్నాడు; పూర్ణచంద్రుని కాంతులీనుతున్నాడు.; అతడు భక్తులందరిని రక్షించే వాడు; సృష్టిలోని సగుణాల పోగు; అతి విశాలమైన కరుణ కలవాడు; వసుదేవుడు ఆ హరిని కనుగొని చూసి పులకించి, ఆశ్చర్యంతో మైమరచి ఉప్పొంగి, ఉబ్బితబ్బిబయ్యాడు. 
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: