Sunday, March 8, 2015

కృష్ణలీలలు

10.1-268-కంద పద్యము
సుడిగాలి వచ్చి నిన్నున్
సుడిగొని కొనిపోవ మింట సుడిసుడి గొనుచున్
బెడఁ గడరెడు నా ముద్దుల
కొడుకా! యేమంటి వనుచు ఘోరం బనుచున్
         “ఓ నా ముద్దుల కొడుకా! అయ్యో సుడిగాలి వచ్చి ఎత్తుకుపోయిందా కొడుకా! ఆకాశంలో సుళ్ళు తిప్పేస్తుంటే ఎంతలా ఏడుస్తున్నావో ఏమిటో. ఎంతగా బెదిరి పోయావో ఏమిటో. మరీ ఇంత ఘోరమా అంటు యశోద వాపోతోంది.
10.1-268-kaMda padyamu
suDigaali vachchi ninnun
suDigoni konipOva miMTa suDisuDi gonuchun
beDaM~ gaDareDu naa muddula
koDukaa! yEmaMTi vanuchu ghOraM banuchun
          సుడిగాలి = సుడిగాలి; వచ్చి = వచ్చి; నిన్నున్ = నిన్ను; సుడిగొని = చుట్టుకొని; కొనిపోవన్ = తీసుకుపోగా; మింటన్ = ఆకాశమున; సుడిసుడిగొనుచున్ = మిక్కలి బడలిక పడుతు; బెడగు = అధికముగ; అడరెడు = అదిరి పడెడి; నా = నా యొక్క; ముద్దుల = గారాల; కొడుకా = పుత్రుడా; ఏమంటివి = ఏమి అంటున్నావు; అనుచున్ = అంటూ; ఘోరంబు = మిక్కలి భయంకరము; అనుచున్ = అంటు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: