10.1-274-కంద పద్యము
మెడ బిగియఁబట్టుకొని డిగఁ
బడియెడి బాలకునిచేతఁ బర్వతనిభుచే
విడివడఁజాలక వాఁ డురిఁ
బడి
బెగడెడు ఖగము భంగి భయముం బొందెన్.
తన
కంఠం బిగించి పట్టుకున్న పర్వతమంత బరువైన కృష్ణబాలకుని బరువు దిగలాగుతుంటే, ఆ
పట్టు తప్పించుకోలేక తృణావర్తుడు ఉరిలో చిక్కుకొని కొట్టుకొనే పక్షిలాగ గిలగిలా
కొట్టుకోసాగాడు.
10.1-274-kaMda padyamu
meDa bigiyaM~baTTukoni DigaM~
baDiyeDi baalakunichEtaM~ barvatanibhuchE
viDivaDaM~jaalaka vaaM~ DuriM~
baDi begaDeDu khagamu bhaMgi bhayamuM boMden.
మెడన్ = కంఠమును; బిగియన్ = బిగుతుగా; పట్టుకొని = పట్టుకొని; డిగబడియెడి = దిగలాగెడి; బాలకుని = పిల్లవాని; చేతన్ = వలన; పర్వత = పర్వతము; నిభున్ = వలె బరువైన
వాని; చేన్ = వలన; విడివడజాలకన్ = వదిలించుకొనలేక; వాడున్ = అతను; ఉరిన్ = ఉచ్చు నందు; పడి = తగుల్కొని; బెగడెడు = వెఱచు నట్టి; ఖగము = పక్షి; భంగిన్ = వలె; భయమున్ = భీతిని; పొందెన్ = పొందెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment