Monday, March 16, 2015

కృష్ణలీలలు

10.1-289-సీస పద్యము
జానుభాగముల హస్తములు వీడ్వడఁ జేసి; నిగుడు చల్లనఁ బోదు రింత నంత
వ్వల పయ్యెద లంది జవ్వాడుదు; రాల క్రేపుల తోఁక లమి పట్టి
విడువ నేరక వాని వెనువెంట జరుగుదు; ప్పంకముల దుడు డర జొత్తు
రెత్తి చన్నిచ్చుచో నిరుదెస పాలిండ్లు; చేతులఁ బుడుకుచుఁ జేపు గలుగ
10.1-289.1-తేటగీతి
దూటుదురు గ్రుక్క గ్రుక్కకు దోర మగుచు
నాడుదురు ముద్దుపలుకు లవ్యక్తములుగఁ
రము లంఘ్రులు నల్లార్చి దలుపుదురు
రామకృష్ణులు శైశవతులఁ దగిలి.
         బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు పసితనంలో క్రమంగా బాల్యక్రీడలతో గోకులంలో అందరకు సంతోషం కలిగిస్తున్నారు. మోకాళ్ళపై చేతులు వూని పట్టి నెమ్మదిగా లేచి నిలబడతారు. తూలుతారు మళ్ళా నిలబడతారు. అటునిటు నడుస్తారు. లేగ ఆవుదూడల తోకలు పట్టుకొంటారు, అవి పరుగెడుతుంటే, ఆ తోకలు వదలిపెట్టలేక వాటి వెనుక జరుగుతు ఉంటారు. తల్లులు పాలు ఇస్తుంటే రెండు చేతులతోను పాలిండ్లు రెండు తడుముతు గుక్కగుక్కకు చేపుకు వచ్చేలా పాలు త్రాగుతుంటారు. వచ్చీరాని ముద్దుమాటలు పలుకుతారు. చేతులు కాళ్ళు కదుపుతు పసిక్రీడలలో నాట్యాలు ఆడేవారు.
10.1-289-seesa padyamu
jaanubhaagamula hastamulu veeDvaDaM~ jEsi; niguDu challanaM~ bOdu riMta naMta
navvala payyeda laMdi javvaaDudu; raala krEpula tOM~ka lalami paTTi
viDuva nEraka vaani venuveMTa jarugudu; rappaMkamula duDu kaDara jottu
retti channichchuchO nirudesa paaliMDlu; chEtulaM~ buDukuchuM~ jEpu galuga
10.1-289.1-tETageeti
dooTuduru grukka grukkaku dOra maguchu
naaDuduru muddupaluku lavyaktamulugaM~
garamu laMghrulu nallaarchi kadalupuduru
          జానుభాగములన్ = మోకాళ్ళపైనుండి; హస్తములున్ = చేతులు; వీడ్వడన్ = విడిచివచ్చునట్లుగ; చేసి = చేసి; నిగుడుచున్ = నిక్కుతూ; పోదురు = వెళ్ళెదరు; ఇంతనంతన్ = కుంచము దూరము; అవ్వల = అమ్మల యొక్క; పయ్యెదలు = పైటకొంగులు; అంది = అందుకొని; జవ్వాడుదురు = ఊగులాడెదరు; ఆలక్రేపుల = ఆవుదూడల; తోకలున్ = తోకలను; అలమి = ఒడిసి (గట్టిగా); పట్టి = పట్టుకొని; విడువన్ = వదల; నేరక = లేక; వాని = వాటి; వెనువెంటన్ = వెనకాతలనే; జరుగుదురు = జారుతారు; = ; పంకములన్ = బురదలలో; దుడుకు = దుడుకుతనము; అడరన్ = అతిశయించగా; చొత్తురు = దూరుదురు; ఎత్తి = ఎత్తుకొని; చన్నున్ = చనుబాలు; ఇచ్చుచోన్ = ఇచ్చునప్పుడు; ఇరు = రెండు (2); దెసన్ = పక్కల; పాలిండ్లున్ = స్తనములను; చేతులన్ = చేతులతో; పుడుకుచున్ = పిసుకుతూ.
            దూటుదురు = పీల్చుకొనెదరు; గ్రుక్కగ్రుక్క = ప్రతిగుక్క; కున్ = కు; తోరము = అధికరుచికరముగ; అగుచున్ = ఔతూ; ఆడుదురు = పలికెదరు; ముద్దు = ఇంపైన; పలుకులు = మాటలు; అవ్యక్తములుగన్ = చక్కగతెలియకుండునట్లు; కరములు = చేతులను; అంఘ్రులున్ = కాళ్ళు; అల్లార్చి = ఊపుతూ; కదలుపుదురు = కదుపుతారు; రామ = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణుడులు; శైశవ = బాల; రతులన్ = క్రీడలందు; తగిలి = ఆసక్తులై.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: