Monday, March 23, 2015

కృష్ణలీలలు

10.1-297-సీస పద్యము
నువున నంటిన రణీ పరాగంబు;
 పూసిన నెఱిభూతి పూఁతగాఁగ;
ముందల వెలుగొందు ముక్తాలలామంబు;
 తొగలసంగడికాని తునుకగాఁగ;
ఫాలభాగంబుపైఁ రగు కావిరిబొట్టు;
 కాముని గెల్చిన న్నుగాఁగఁ;
గంఠమాలికలోని ననీల రత్నంబు;
 మనీయ మగు మెడప్పుగాఁగ;
10.1-297.1-ఆటవెలది
హారవల్లు లురగ హారవల్లులుగాఁగ;
బాలలీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.
          ఆ శ్రీపతి అపరావతారమైన బాలకృష్ణుడు ఎదగకుండానే పెద్దవాడైన ప్రౌఢబాలకుడు. హరి హరులకు భేదం లేదు ఇద్దరు ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు బాల్యంలో ఆటపాటల సమయాలలో పరమశివుని వలె కనిపించేవాడు. ఎలా అంటే. దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనిపించేది. యశోద ముత్యాలపేరుతో ఉంగరాలజుట్టు పైకి మడిచి ముడివేసింది. అది శంకరుని తలపై ఉండే చంద్రవంకలా కనబడసాగింది. నుదుట పెట్టిన నల్లని అగులు బొట్టు ముక్కంటి మూడవకన్నులా అగబడసాగింది. మెడలో వేసిన రత్నాలహారం మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద ఇంద్రనీల మణి, ఈశ్వరుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలా కనబడేది,  మెళ్ళోవేసిన సర్పహారాలుగా కనబడుతున్నాయి. అలా చిన్ని కృష్ణుడు శివునిలా కనబడుతున్నాడు.
          ఆ కాలపు వీరశైవ వీరవైష్ణవ భేదాలను పరిహరించిన విప్లవ కవి, ప్రజాకవి మన బమ్మెర పోతనామాత్యుల వారు.
10.1-297-seesa padyamu
tanuvuna naMTina dharaNee paraagaMbu;
 poosina neRribhooti pooM~tagaaM~ga;
muMdaRra velugoMdu muktaalalaamaMbu;
 togalasaMgaDikaani tunukagaaM~ga;
phaalabhaagaMbupaiM~ baragu kaaviriboTTu;
 kaamuni gelchina kannugaaM~gaM~;
gaMThamaalikalOni ghananeela ratnaMbu;
 kamaneeya magu meDakappugaaM~ga;
10.1-297.1-aaTaveladi
haaravallu luraga haaravallulugaaM~ga;
baalaleelaM~ brauDhabaalakuMDu
shivuni pagidi noppe shivunikiM~ danakunu
vERrulEmiM~ delupa velayunaTlu.
          తనువున్ = ఒంటికి; అంటిన = అంటుకొన్న; ధరణీ = మట్టి; పరాగంబున్ = మరకలు; పూసిన = రాసుకొన్న; నెఱి = నిండైన; భూతి = వీబూది; పూత = పూత; కాగన్ = అగుచుండగా; ముందలన్ = శిరస్సు పై; వెలుగొందు = ప్రకాశించెడి; ముక్తాలలామంబు = ముత్యాలచేరు; తొగలసంగడికాని = చంద్రుని {తొగలసంగడికాడు -తొగ (కలువ)ల సంగటికాడు (స్నేహితుడు), చంద్రుడు}; తునుక = రేఖ; కాగన్ = అగుచుండగా; ఫాలభాగంబు = నుదిటి; పైన్ = మీద; పరగు = ఉండునట్టి; కావిరిబొట్టు = నల్లబొట్టు; కాముని = మన్మథుని; గెల్చిన = జయించిన; కన్ను = కన్ను (మూడవకన్ను); కాగన్ = అగుచుండగా; కంఠమాలిక = మెడలోనిహారము; లోని = అందలి; ఘన = బాగాపెద్ద; నీల = ఇంద్రనీల; రత్నంబు = మణి; కమనీయము = అందమైనది; అగు = ఐన; మెడకప్పు = కంఠమునందలినల్లదనం; కాగన్ = అగుచుండగా.
            హారవల్లులు = ముత్యాలహారపుపేటలు; ఉరగ = సర్పములనెడి; హారవల్లులు = దండలపేర్లు; కాగన్ = అగుచుండగా; బాల = పసితనపు; లీలన్ = విలాసములతో; ప్రౌఢ = అన్నీతెలిసిన; బాలకుండు = పిల్లవాడు; శివుని = పరమశివుని; పగిదిన్ = వలె; ఒప్పెన్ = కనబడుచుండెను; శివుని = పరమశివుని; కిన్ = కి; తన = తన; కును = కు; వేఱు = భేదము; లేమిన్ = లేకపోవుటను; తెలుపన్ = తెలియజేయుటకు; వెలయున = విలసిల్లిన; అట్లు = విధముగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: