Wednesday, March 11, 2015

కృష్ణలీలలు

10.1-271-శార్దూల విక్రీడితము
లోఁ జక్రసమీరదైత్యుఁడు మహాహంకారుఁడై మింటికిన్
బాలుం దోకొని పోయిపోయి తుదిఁ దద్భారంబు మోవన్ బల
శ్రీ లేమిం బరిశాంత వేగుఁ డగుచుం జేష్టింపఁగా లేక ము
న్నీలా గర్భకుఁ జూడ నంచు నిటమీఁ దెట్లంచుఁ జింతించుచున్.
         ఈలోగా, ఆ సుడిగాలిరాక్షసుడు, తృణావర్తుడు మిక్కిలి అహంకారంతో బాలకృష్ణుని ఆకాశంలో ఎంతో ఎత్తుకి తీసుకుపోసాగాడు. అయితే కృష్ణుడు క్రమేపీ బరువెక్కి పోసాగాడు. క్రమేణా రాక్షసుడికి బాలుని బరువు భరించే శక్తి సామర్థ్యాలు సరిపోటం లేదు. వాడి తిరిగే వేగం తగ్గిపోతోంది. కడకు కదలటం కూడ కష్టసాధ్యం అయిపోయింది. ఇంతకు ముందు ఇలాంటి పిల్లాణ్ణి ఎక్కడా చూడలేదే, ఇంకెలా బతకను చేయను బాబోయ్ అని విచారించసాగాడు.
10.1-271-shaardoola vikreeDitamu
aalOM~ jakrasameeradaityuM~Du mahaahaMkaaruM~Dai miMTikin
baaluM dOkoni pOyipOyi tudiM~ dadbhaaraMbu mOvan bala
shree lEmiM barishaaMta vEguM~ DaguchuM jEShTiMpaM~gaa lEka mu
nneelaa garbhakuM~ jooDa naMchu niTameeM~ deTlaMchuM~ jiMtiMchuchun.
          = అంత; లోన్ = లోపల; చక్రసమీర దైత్యుడు = తృణావర్తుడు {చక్రసమీరదైత్యుడు - చక్రసమీర (సుడిగాలి) దైత్యుడు (రాక్షసుడు), తృణావర్తుడు}; మహా = మిక్కలి; అహంకారుడు = అహంకారము గలవాడు; = అయ్యి; మింటి = ఆకాసమున; కిన్ = కు; బాలున్ = పిల్లవానిని; తోకొని = తీసుకొని; పోయిపోయి = చాలా దూరము పోయి; తుదిన్ = చివరకు; తత్ = అతని; భారంబున్ = బరువును; మోవన్ = మోయుటకు; బల = బలము; శ్రీ = కలిమి; లేమిన్ = లేకపోవుటచేత; పరి = మిక్కలి; శాంత = తగ్గిన; వేగుడు = వేగముగలవాడు; అగుచున్ = ఔతూ; చేష్టింపగా లేక = కదలమెదలలేక; మున్ను = ఇంత క్రిత మెప్పుడును; ఇలాగు = ఇలా; అర్భకున్ = ఏ పిల్లవానిని; చూడన్ = చూడలేదు; అంచున్ = అనుచు; ఇటమీద = ఇకపై; ఎట్లు = ఎలాగ; అంచున్ = అనుచు; చింతించుచున్ = బాధపడుతు;
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: