Saturday, March 14, 2015

కృష్ణలీలలు

10.1-275-కంద పద్యము
రి కరతల పీడనమునఁ
వశుఁడై ఱాలమీఁద గ్నాంగకుఁ డై
సువైరిభటుఁడు గూలెను
బుభంజను కోలఁ గూలు పురముం బోలెన్.
         అలా పాపాలు హరించేవాడైన శ్రీకృష్ణుడు చేతులుతో నొక్కుతున్న నొక్కుడుకి, స్వాధీనం తప్పి తృణావర్తుడు రాళ్ళమీద పడ్డాడు. అలా త్రిపురసంహారి శంకరుని బాణం దెబ్బకి పురము కూలినట్లు కూలి పడ్డ ఆ దేవతల శత్రువు అవయవాలు అన్నీ తుక్కు తుక్కుగా చితికిపోయాయి.
10.1-275-kaMda padyamu
hari karatala peeDanamunaM~
baravashuM~Dai RraalameeM~da bhagnaaMgakuM~ Dai
suravairibhaTuM~Du goolenu
burabhaMjanu kOlaM~ goolu puramuM bOlen.
          హరి = బాలకృష్ణుని; కరతల = అరచేతుల; పీడనమునన్ = నొక్కబడుటచేత; పరవశుడు = స్వాధీనముతప్పినవాడు; = అయ్యి; ఱాల = రాళ్ళ; మీదన్ = పైన; భగ్నాంకుడు = విరిగిన అంగాలుకలవాడు; = అయ్యి; సురవైరి = కంసుని {సురవైరి - సురల (దేవతల) వైరి (శత్రువు), కంసుడు}; భటుడు = బంటు; కూలెన్ = పడిపోయెను; పురభంజను = పరమశివుని {పురభంజనుడు - త్రిపురసంహారుడు, శివుడు}; కోలన్ = బాణమునకు; కూలు = పడిపోయిన; పురమున్ = పురములు; పోలెన్ = వలె.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: