10.1-295-కంద పద్యము
అడుగులు వే గలిగియు రెం
డడుగులనే మన్నుమిన్ను నలమిన బాలుం
డడుగిడఁ దొడఁగెను శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడు గవనిఁబడన్.
సహస్ర శీరుషా పురుషః
సహస్రాక్షస్సహస్రపాత్ అనగా విష్ణుమూర్తి సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు,
సహస్రపాదుడు. అలా వేయి అడుగులు కలిగిన వాడు. ఇక్కడ వేయి, సహస్రం అంటే అనంతమని
గ్రహించదగును. వామనావతారుడై బలిచక్రవర్తి నుండి మూడడుగుల భూమి యాచించి, రెండు
అడుగులలో భూమిని ఆకాశాన్ని ఆవరించిన వాడు. అట్టి పరమాత్మ ఇలా శ్రీకృష్ణబాలకుడై
తప్పటడుగులు వేయ నారంభించాడు. ఆయన అడుగులు వేయటం చూసి దుష్టులు కాళ్ళు కీళ్ళు
జారిపోయి అధమ బుద్దులు, సణుగుళ్ళు వదిలేసి అడుగున పడి అణగిపోయారు.
10.1-295-kaMda padyamu
aDugulu vE galigiyu reM
DaDugulanE mannuminnu nalamina baaluM
DaDugiDaM~ doDaM~genu shaatravu
laDugulu saDugulunu vadali yaDu gavaniM~baDan.
అడుగులు = కాళ్ళు; వేగలిగియున్ = వేయిగలిగినను; రెండు = రెండు
(2); అడుగులనే = అడుగులతోనే; మన్నున్ = భూమండలము; మిన్నున్ = ఆకాశములను; అలమిన = ఆక్రమించిన; బాలుండు = పిల్లవాడు; అడుగిడన్ = అడుగులువేయుట; తొడగెన్ = మొదలిడెను; శాత్రవుల = శత్రువుల
యొక్క; అడుగులు = అడుగులువేయుట; సడుగులును = కీళ్ళును; వదలి = వదులైపోయి; అడుగు = అడుగు; అవనిన్ = నేలపై; పడన్ = వేస్తుండగా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment