Wednesday, March 4, 2015

కృష్ణలీలలు

10.1-263-వచనము
అప్పుడు.
10.1-264-కంద పద్యము
రుఁడగు కంసునిపంపున
రిగి తృణావర్తుఁ డవని వచాటముగాఁ
సుకరువలి యై బిసబిస
రు దరు దన ముసరి విసరి రిఁ గొనిపోయెన్.
         అప్పుడు అలాబరువెక్కిన చంటిపిల్లవానిని తల్లి కింద పెట్టి వెళ్ళినప్పుడు.
         కఠినాత్ముడైన కంసుడు పంపిన తృణావర్తుడనే రాక్షసుడు అకస్మాత్తు నేల మీదకి వచ్చాడు. ఆ రావటం రావటం సుడిగాలి రూపంలో రయ్” “రయ్ మంటు అందరు ఆశ్చర్యపోయేలా మిక్కిలి వడితో కమ్ముకుంటు వచ్చి, ఒక్కవిసురుతో కృష్ణబాలకుని పైకి ఎత్తుకుపోయాడు.
10.1-263-vachanamu
appuDu.
10.1-264-kaMda padyamu
kharuM~Dagu kaMsunipaMpuna
narigi tRiNaavartuM~ Davani kavachaaTamugaaM~
surakaruvali yai bisabisa
naru daru dana musari visari hariM~ gonipOyen.
          అప్పుడు = ఆ సమయమునందు.
          ఖరుడు = కఠినుడు; అగు = ఐన; కంసుని = కంసుని యొక్క; పంపునన్ = ఆఙ్ఞానుసారము; అరిగి = వెళ్ళి; తృణావర్తుడు = తృణావర్తుడను రాక్షసుడు; అవని = లోకుల; కిన్ = కి; అవచాటముగా = అకస్మాత్తుగా, ఊహించని విధంగా; సురకరువలి = సుడిగాలి; = అయ్యి; బిసబిస = వేగముగా; అరుదు = వింతలలో; అరుదు = వింత; అనన్ = అనుచుండగ; ముసరి = ఆవరించి; విసిరి = బలంగావీచి; హరిన్ = కృష్ణుని; కొనిపోయెన్ = తీసుకుపోయెను.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: