Thursday, March 12, 2015

కృష్ణలీలలు

10.1-272-వచనము
అట్లు దనుజుండు చింతించుచున్న సమయంబున.
10.1-273-కంద పద్యము
బాద్విరద కరంబులఁ
బోలెడి కరములను దనుజు బొండుగు బిగియం
గీలించి వ్రేలఁ బడియెను
బాకుఁ డొక కొండభంగి రువై యధిపా!
         అలా తృణావర్తుడు బాలుని బరువు మోయలేక ఆరాటపడుతున్నాడు.
         ఓ పరీక్షిన్మహారాజా! కృష్ణుడు గున్న ఏనుగు తొండాల్లాంటి తన రెండు చేతులు తృణావర్తుని కంఠానికి, శిక్షగావేసే బొండకొయ్యలా, మెలేసి బిగించాడు. పెద్ద కొండంత బరువై వాడి మెడగట్టిగా పట్టుకొని వేళ్ళాడసాగాడు.
         రాజు శిక్షవేస్తేనే ఇక్కడ బాధపెట్టినా, పాప పరిహారం జరిగి నరకబాధలు తగ్గుతాయి. అలాగే భగవంతుడు వేసే శిక్షైనా అనుగ్రహమే. అందుకే అధిపా అని ప్రయోగించారేమో అనుకుంటాను.
10.1-272-vachanamu
aTlu danujuMDu chiMtiMchuchunna samayaMbuna.
10.1-273-kaMda padyamu
baaladvirada karaMbulaM~
bOleDi karamulanu danuju boMDugu bigiyaM
geeliMchi vrElaM~ baDiyenu
baalakuM~ Doka koMDabhaMgi baruvai yadhipaa!
          అట్లు = ఆ విధముగ; దనుజుండు = రాక్షసుడు; చింతించుచున్న = బాధపడుతున్న; సమయంబునన్ = సమయము నందు.
          బాల = పిల్ల, గున్న; ద్విరద = ఏనుగు; కరంబులన్ = తొండముల; పోలెడి = వంటి; కరములను = చేతులతో; దనుజున్ = రాక్షసుని; పొండుగున్ = కంఠనాళమును {బొండ = తప్పుచేసినవారి కాలుచేతులకు తగిల్చెడి ఒక రకం కర్రయంత్రం, బొండకొయ్య}; బిగియన్ = గట్టిగా; కీలించి = చేర్చిపట్టుకొని; వ్రేలబడియెను = వేలాడబడెను; బాలకుడు = పిల్లవాడు; ఒక = ఒక; కొండ = పర్వతము; భంగిన్ = వలె; బరువై = బరువెక్కినవా డయ్యి; అధిపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: