10.1-291-సీస పద్యము
తల లెత్తి మెల్లనఁ దడవి యాడెడు వేళ; పన్నగాధీశులపగిదిఁ దాల్తు;
రంగసమ్మృష్ట పంకాంగరాగంబుల; నేనుగుగున్నల నెత్తువత్తు;
రసమంబులైన జవ్వాడు లేఖంబుల; సింగంపుఁగొదమల సిరి వహింతు;
రాననంబుల కాంతు లంతకంతకు నెక్కు; బాలార్క చంద్రుల పగిదిఁ దోతు;
10.1-291.1-తేటగీతి
రెలమిఁ దల్లుల చన్నుఁబా లెల్లఁ ద్రావి
పరమయోగోద్భవామృత పానలీల
సోలి యెఱుగని యోగుల సొంపు గందు
రా కుమారులు
జనమనోహారు లగుచు.
అలా బలభద్ర కృష్ణులు బాల్యక్రీడలలో
నేలపై ప్రాకుతు మెల్లగా తలలెత్తి ఆడుకుంటు ఉంటే, ఆదిశేషుడు వంటి సర్పరాజులు
పడగెత్తి ఆడుతున్నట్లు కనిపిస్తారు. ఆటల్లో ఒంటినిండ మట్టి అంటినప్పుడు ఏనుగు
గున్నలలా గోచరిస్తారు. కుప్పిగంతులు వేసేటప్పుడు సాటేలేని జవసత్వాలతో సింహం
పిల్లలులా కనిపిస్తారు. రోజు రోజుకి వారి ముఖలలోని తేజస్సు పెరుగుతు ఉదయిస్తున్న
సూర్య చంద్రులు లాగ కనబడతారు. తల్లుల చనుబాలన్నీ త్రాగి నిద్ర కూరుకు వస్తుంటే,
చక్కటి యోగసాధనతో కలిగిన అనుభవం అనే అమృతాన్ని ఆస్వాదిస్తున్న యోగీశ్వరుల వలె
గోచరిస్తున్నారు, వారి లీలలు వీక్షిస్తున్న వ్రేపల్లెవాసులకు తన్మయత్వం కలుగుతోంది.
10.1-291-seesa
padyamu
tala letti mellanaM~ daDavi yaaDeDu vELa;
pannagaadheeshulapagidiM~ daaltu;
raMgasammRiShTa paMkaaMgaraagaMbula; nEnugugunnala nettuvattu;
rasamaMbulaina javvaaDu lEkhaMbula; siMgaMpuM~godamala siri
vahiMtu;
raananaMbula kaaMtu laMtakaMtaku nekku; baalaarka chaMdrula
pagidiM~ dOtu;
10.1-291.1-tETageeti
relamiM~ dallula channuM~baa lellaM~ draavi
paramayOgOdbhavaamRita paanaleela
sOli yeRrugani yOgula soMpu gaMdu
raa kumaarulu janamanOhaaru laguchu.
తలలు = శిరస్సులను; ఎత్తి = పైకెత్తి; మెల్లనన్ = మెల్లగా; తడవియాడెడి = పాకెడి; వేళన్ = సమయమునందు; పన్నగాధీశుల = సర్పరాజుల {పన్నగాధీశులు - ఆదిశేషుడు అనంతుడు వాసుకి మున్నగు
సర్పరాజులు};
పగిదిన్ = విధమును; తాల్తురు = ధరింతురు; అంగ = అవయవములకు; సమ్మృష్ట = బాగాపూసుకొన్న; పంక = బురద
యనెడి; అంగరాగంబులన్ = గంధపుపూతలచే; ఏనుగు = ఏనుగు; గున్నలన్ = పిల్లల; ఎత్తువత్తురు = సాటియగుదురు; అసమంబులు = సాటిలేని; ఐన = అయినటువంటి; జవ్వాడు = గంతులు
వేసెడి; లేఖంబులన్ = విధములచేత; సింగపు = సింహపు; కొదమల = పిల్లల; సిరిన్ = మేలిమిని; వహింతురు = పొందెదరు; ఆననంబుల = మోముల; కాంతులు = వికాసములు; అంతంతకున్ = అంతకంతకు; ఎక్కు = ఎక్కువగుతు; బాల = అప్పుడే ఉదయించిన;
అర్క = సూర్యుబింబము; చంద్రుల = చంద్రుబింబముల; పగిదిన్ = వలె; తోతురు = కనబడుదురు; ఎలమిన్ = చక్కగా; తల్లుల = తల్లుల
యొక్క.
చన్నుబాలు = స్తన్యములు; ఎల్లన్ = అన్ని; త్రావి = తాగి; పరమ = సర్వోత్కృష్టమైన; యోగ = బ్రహ్మనిష్టవలన; ఉద్భవ = పుట్టిన; అమృత = ఆనందామృతమును; పాన = తాగిన; లీలన్ = విధముగ; సోలి = మైమరచి; ఎఱుగని = తెలియని;
యోగుల = యోగుల; సొంపున్ = ఆనందమును; కందురు = పొందెదరు; ఆ = ఆ; కుమారులు = పిల్లలు; జన = ప్రజల; మనః = మనసులను; హారులు = దోచుకొనువారు; అగుచున్ = ఔతూ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment