Monday, March 2, 2015

కృష్ణలీలలు

10.1-261-కంద పద్యము
కొడుకు నొకనాడు తొడపై
నిడుకొని ముద్దాడి తల్లి యెలమి నివురుచోఁ
డుదొడ్డ కొండ శిఖరము
డువున వ్రేఁ గయ్యె నతఁడు సుధాధీశా!
         ఓ మహారాజా! పరీక్షిత్తు! తల్లి యశోదాదేవి, ఒకరోజు పాపని ఒళ్ళో కూర్చుండబెట్టుకొంది. ముద్దులుపెట్టి లాలించి ఒడలు నిమురుతోంది. ఇంతలో ఆ యశోదా కృష్ణుడు చటుక్కున పెద్ద కొండరాయి అంత బరువెక్కి పోసాగాడు.
10.1-261-kaMda padyamu
koDuku nokanaaDu toDapai
niDukoni muddaaDi talli yelami nivuruchOM~
gaDudoDDa koMDa shikharamu
vaDuvuna vrEM~ gayye nataM~Du vasudhaadheeshaa!
          కొడుకున్ = కుమారుడు; ఒక = ఒకానొక; నాడు = దినమున; తొడ = ఒడి; పైన్ = అందు; ఇడుకొని = పెట్టుకొని; ముద్దాడి = ముద్దులు పెట్టి; తల్లి = తల్లి; ఎలమిన్ = ప్రేమతో; నివురుచోన్ = దేహముపై రాయుచుండగా; కడు = మిక్కిలి; దొడ్డ = పెద్ద; కొండ = కొండ యొక్క; శిఖరము = శిఖరము; వడువునన్ = వలె; వ్రేగు = బరువెక్కినవాడు; అయ్యెన్ = అయిపోయెను; అతడు = అతను; వసుధాధీశ = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: