ఉ.
పాపనిఁ జూడఁ గానక విపద్దశ నొంది కలంగి తల్లి
యో
పాపఁడ! బాలసూర్యనిభ! బాలశిరోమణి! నేడు గాలికిం
జేపడిపోయితే యనుచుఁ జీరుచు దైవముఁ జాల దూఱుచుం
దాపము నొంది నెవ్వగలడయ్యుచుఁ గుందుచు బిట్టు
గూయుచున్
తన చంటిబిడ్డ కృష్ణుడు
కనబడకపోడం అనే విపత్తులో పడి కొట్టుకుంటున్న యశోదాదేవి ఎంతో కలత చెందింది. “ఓ నా చిట్టితండ్రీ! ఉదయించే సూర్యుని లాంటి ప్రకాశం కలవాడవు కదా నువ్వు. బాలలలో వరేణ్యుడవుకదా.
ఇదేమిటయ్యా, ఇలా సుడిగాలి బారిన పడిపోయావు” అని పిలుస్తూ
విలపించింది. ఇలాటి విపద్దశ కలిగించిన దేవుణ్ణి అనేక రకాలుగా నిందించింది. ఎఁతో
బాధ పడింది. బాధతో కుంగిపోతు విలపించసాగింది.
u.
paapaniM~ jooDaM~ gaanaka vipaddasha noMdi kalaMgi talli yO
paapaM~Da! baalasooryanibha! baalashirOmaNi! nEDu gaalikiM
jEpaDipOyitE yanuchuM~ jeeruchu daivamuM~ jaala dooRruchuM
daapamu noMdi nevvagalaDayyuchuM~ guMduchu biTTu gooyuchun
పాపని = శిశువును; చూడన్ = చూచుటకు; కానక = కనబడని; విపత్ = ఆపదల; దశన్ = స్థితిని; ఒంది = పొంది; కలంగి = కలతచెంది; తల్లి = తల్లి; ఓ = ఓయీ; పాపడ = బిడ్డడ; బాలసూర్య = ఉదయిస్తున్నసూర్యుని; నిభ = వంటివాడ; బాల = శిశువులలో; శిరోమణి = శ్రేష్ఠుడా; నేడు = ఇవాళ; గాలి = వాయువుల; కిన్ = కి; చేపడిపోయితే = చిక్కుపడిపోతివా; అనుచున్ = అనుచు; చీరుచున్ = పిలుచుచు; దైవమున్ = దేవుడిని; చాలన్ = ఎక్కువగా; దూఱుచున్ = తిడుతూ; తాపమున్ = బాధ; ఒంది = పడి; నెవ్వ = అధికమైన; వగలన్ = విచారములచేత; డయ్యుచున్ = కుంగిపోతూ; కుందుచున్ = దుఃఖించుచు; బిట్టు = బిగ్గరగా; కూయుచున్ = ఏడ్చుచు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment