10.1-299-వచనము
ఆ
సమయంబున బాలకుల తల్లులు గోఱ గోరు కొమ్ములు గల జంతువులవలన నేమఱక, జలదహనకంటకాదుల యెడ మోసపోక, బాలసంరక్షణంబు చేయుచు
నుల్లంబుల మొల్లంబు లైన ప్రేమంబు లభిరామంబులుగా విహరించుచుండి రంత.
బలరామకృష్ణులు
శైశవలీలలు ప్రదర్శిస్తున్న సమయంలో, వారి తల్లులు రోహిణి, యశోదలు చక్కని
జాగ్రత్తలతో ఆ బాలురను పెంచుతు వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు ఉన్న
జంతువులనుండి;
నీళ్ళు, నిప్పు, ముళ్ళు మొదలైన వానినుండి ప్రమాదాలు జరగకుండ
జాగ్రత్త పడ్డారు. హృదయాలలో బాలకుల యెడ ప్రేమానురాగాలు ఉప్పొంగుతు ఉండగా ఆనందంగా
కాలం గడుపుతున్నారు.
10.1-299-vachanamu
aa samayaMbuna baalakula tallulu gORra gOru kommulu gala
jaMtuvulavalana nEmaRraka, jaladahanakaMTakaadula yeDa mOsapOka,
baalasaMrakShaNaMbu chEyuchu nullaMbula mollaMbu laina prEmaMbu
labhiraamaMbulugaa vihariMchuchuMDi raMta.
ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; బాలకుల = పిల్లల; తల్లులు = తల్లులు; కోఱన్ = కోరలుగల; గోరు = గోర్లుగల; కొమ్ములుగల = కొమ్ములుగల; జంతువుల = ప్రాణుల; వలనన్ = నుండి; ఏమఱక = ప్రమత్తులు
కాకుండ; జల = నీరు; దహన = అగ్ని; కంటక = ముల్లు; ఆదులన్ = మున్నగువాని; ఎడన్ = అందుకొని; మోసపోక = ఏమరకుండ; బాల = పిల్లల; సంరక్షణంబు = పోషణ; చేయుచున్ = చేస్తూ;
ఉల్లంబుల = హృదయములలో; మొల్లంబులు = అధికములు; ఐన = అయిన; ప్రేమంబులన్ = అభిమానములతో; అభిరామంబులుగా = మనోజ్ఞముగా; విహరించుచుండిరి = క్రీడించుచుండిరి; అంతన్ = అప్పుడు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment