Thursday, March 19, 2015

కృష్ణలీలలు

10.1-292-కంద పద్యము
చూని వారల నెప్పుడు
జూక లోకములు మూఁడు చూపులఁ దిరుగం
జూడఁగ నేర్చిన బాలక
చూడామణి జనుల నెఱిఁగి చూడఁగ నేర్చెన్.
         ఊర్థ్వ, అధో, భూలోకాలు మూటిని తన కనుసన్నలలో నడుపే ఆ శ్రీహరి, భక్తిలేక తనని లెక్కచేయని వారి ఎడల దయచూపడు. అట్టి శ్రీహరి శైశవశ్రేష్ఠు డైన కృష్ణుడుగా కళ్ళు తిప్పుతు చుట్టుపక్కలవారిని చూసి గుర్తుపట్ట నారంభించాడు.
10.1-292-kaMda padyamu
chooDani vaarala neppuDu
jooDaka lOkamulu mooM~Du choopulaM~ dirugaM
jooDaM~ga nErchina baalaka
chooDaamaNi janula neRriM~gi chooDaM~ga nErchen.
          చూడని = భక్తిలేక తనని లెక్కచేయని; వారలన్ = వారిని; ఎప్పుడును = ఏ సమయమునందును; చూడక = దయచూడకుండ; లోకములున్ = లోకములు {ముల్లోకములు - 1భూలోకము 2స్వర్గలోకము 3పాతాళలోకము}; మూడున్ = మూడింటిని; చూపులన్ = తన ఆజ్ఞప్రకారము; తిరుగన్ = నడచునట్లుగ; చూడగన్ = చేయుట; నేర్చిన = తెలిసిన; బాలక = బాలురలో; చూడామణి = శ్రేష్ఠుడు (తలపైనిమణివలె); జనులన్ = చుట్టుపక్కలవారిని; ఎఱిగి = ఆనమాలుపట్టి; చూడగన్ = చూచుటను; నేర్చెన్ = నేర్చుకొనెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: