10.1-303-కంద పద్యము
వల్లవగృహనవనీతము
లెల్లను భక్షించి వచ్చి యెఱుఁగని భంగిం
దల్లిఁ గదిసి చిట్టాడుచు
నల్లనఁ జను బువ్వఁ బెట్టుమవ్వా! యనుచున్.
గోపికల ఇళ్ళల్లో వెన్నంతా తిని యింటికి
వచ్చి, అల్లరి కృష్ణుడు ఏమీ తెలియనివానిలా మెల్లిగా
తల్లి పక్కకి చేరతాడు. అమ్మా బువ్వ పెట్టు అంటు ఊరికే ఇల్లంతా తిరిగేస్తాడు.
10.1-303-kaMda padyamu
vallavagRihanavaneetamu
lellanu bhakShiMchi vachchi yeRruM~gani bhaMgiM
dalliM~ gadisi chiTTaaDuchu
nallanaM~ janu buvvaM~ beTTumavvaa! yanuchun.
వల్లవ = గోపికా; గృహంబున్ = ఇండ్లలోని; నవనీతములు = వెన్నలు; ఎల్లను = అన్నిటిని; భక్షించి = తినివేసి; వచ్చి = వచ్చి; ఎఱుగని = ఏమీ తెలియనివాని; భంగిన్ = వలె; తల్లిన్ = తల్లిని; కదిసి = చేరి; చిట్టాడుచున్ = ఇటునిటు తిరుగుచు; అల్లనన్ = మెల్లిగా; చనున్ = వెళ్ళును; బువ్వ = అన్నము; పెట్టుము = పెట్టు; అవ్వా = అమ్మా; అనుచున్ = అంటూ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment