Sunday, March 29, 2015

కృష్ణలీలలు

10.1-304-వచనము
మఱియు గోపకుమారులం గూడికొని కృష్ణుండు.
10.1-305-సీస పద్యము
గోవల్లభుఁడ నేను; గోవులు మీ రని; డి ఱంకె వైచుచు వంగి యాడు;
రాజు నే; భటులు మీలు రండురం డని; ప్రాభవంబునఁ బెక్కు నులుపనుచు;
నేఁదస్కరుండ; మీరింటివా రని నిద్ర; పుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు;
నే సూత్రధారి; మీ రిందఱు బహురూపు; ని చెలంగుచు నాటలాడఁ బెట్టు;
10.1-305.1-తేటగీతి
మూల లుఱుకును; డాఁగిలిమూఁతలాడు;
నుయ్యలల నూఁగుఁ జేబంతు లొనరవైచు;
జార చోరుల జాడలఁ జాల నిగుడు;
శౌరి బాలురతో నాడుమయమందు.
         మరి కృష్ణబాలుడు గోపబాలురు అందరితో కలిసి, రకరకాల ఆటలు ఆడసాగాడు.
         నేను ఆబోతును, మీరందరు ఆవులు అంటు, ఆబోతులా రంకలు వేస్తూ పరుగుపెడతాడు. నేను రాజను, మీరు అందరు నా భటులుఅంటు, అధికారం చూపుతు వాళ్ళు ఎన్నో పనులు చెప్పి చేయిస్తాడు. నేను దొంగను మీరు గృహస్థులు అంటు వారిని నిద్రపుచ్చి, వారి వస్తువులు తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. మీరందరు నాటకాలలో పాత్రధారులు, నేను దర్శకత్వంచేసే సూత్రధారుడను అంటు వారందరి చేత ఆటలు ఆడిస్తు ఉంటాడు. మూలమూలలోను దూరుతు ఉంటాడు దాగుడుమూతలు ఆడతాడు. ఉయ్యాలలు ఊగుతాడు. చేతిబంతులు ఎగరేసి ఆడుతుంటాడు. జారునిలా, చోరునిలా రకరకాల పోకళ్ళు పోతాడు.  
10.1-304-vachanamu
maRriyu gOpakumaarulaM gooDikoni kRiShNuMDu.
10.1-305-seesa padyamu
gOvallabhuM~Da nEnu; gOvulu mee rani; vaDi RraMke vaichuchu vaMgi yaaDu;
raaju nE; bhaTulu meeralu raMDuraM Dani; praabhavaMbunaM~ bekku panulupanuchu;
nEM~daskaruMDa; meeriMTivaa rani nidra; puchchi sommulu gonipOyi DaaM~gu;
nE sootradhaari; mee riMdaRru bahuroopu; lani chelaMguchu naaTalaaDaM~ beTTu;
10.1-305.1-tETageeti
moola luRrukunu; DaaM~gilimooM~talaaDu;
nuyyalala nooM~guM~ jEbaMtu lonaravaichu;
jaara chOrula jaaDalaM~ jaala niguDu;
shauri baaluratO naaDusamayamaMdu.
          మఱియున్ = ఇంకను; గోపకుమారులన్ = గొల్లపిల్లలను; కూడికొని = కలుపుకొని; కృష్ణుండు = కృష్ణుడు.
          గోవల్లభుండన్ = ఎద్దును; నేను = నేను; గోవులు = ఆవులు; మీరు = మీరందరు; అని = అని; వడిన్ = వేగముగ; ఱంకె = ఎద్దుఅరుపువలెఱంకె; వైచుచున్ = వేస్తూ; వంగి = ఎద్దువలెవంగి; ఆడున్ = ఆటలాడును; రాజున్ = రాజును; నేన్ = నేను; భటులు = సేవకులు; మీరలు = మీరు; రండురండు = తొందరగారండి; అని = అని; ప్రాభవంబునన్ = అధికారస్వరముతో; పెక్కు = అనేకమైన; పనులున్ = పనులను; పనుచున్ = అప్పజెప్పును; నేన్ = నేను; తస్కరుండన్ = దొంగను; మీరున్ = మీరు; ఇంటివారు = గృహస్తులు; అని = అని; నిద్ర = నిద్ర; పుచ్చి = పోవునట్లుచేసి; సొమ్ములున్ = ఆభరణములు; కొనిపోయి = తీసుకెళ్ళి; డాగున్ = దాగుకొనును; నేన్ = నేను; సూత్రధారి = దారములబట్టితిప్పువాడు; మీరు = మీరు; అందఱున్ = అందరు; బహురూపులు = అనేకరూపములబొమ్మలు; అని = అని; చెలంగుచున్ = చెలరేగుచు; ఆటలాడబెట్టున్ = ఆట్లాడునట్లుచేయును.
            మూలలున్ = సందుగొందులలోకి; ఉఱుకును = పరుగెత్తును; డాగిలిమూతలు = దాగుడుమూత ఆటలు; ఆడును = ఆడును; ఉయ్యలలన్ = ఉయ్యాలలు; ఊగున్ = ఊగును; చే = చేతిలోని; బంతులున్ = బంతులను; ఒనరన్ = చక్కగా; వైచున్ = వేయును; జార = జారుల; చోరుల = దొంగల; జాడలన్ = వలె; చాలన్ = మిక్కలి; నిగుడున్ = వ్యాపించును; శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని వంశపు వాడు, కృష్ణుడు}; బాలుర = పిల్లల; తోన్ = తోటి; ఆడు = ఆడెడి; సమయమందు = వేళ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: