Friday, March 20, 2015

కృష్ణలీలలు

10.1-293-కంద పద్యము
వు లనవిద్య పోఁడిమి
గుబాటుగఁ జేయనేర్చు గవరి యంతన్
గుమొగముతోడ మెల్లన
గుమొగముల సతులఁ జూచి గ నేర్చె నృపా!
          ఓ పరీక్షిన్మహారాజా! మహావిష్ణువు చిరునవ్వు నవ్వితే ఆత్మజ్ఞానము కాని లౌకిక విద్యలను దట్టమైన అజ్ఞానం నవ్వులపాలై, జ్ఞానం పుట్టుకొస్తుంది. అంతటి పరదైవము మానవ బాలకృష్ణునిగా తనను చూసి నవ్వుతున్న గోపకాంతలను చూసి నవ్వటం నేర్చాడు.

10.1-293-kaMda padyamu
nagavu lanavidya pOM~Dimi
nagubaaTugaM~ jEyanErchu nagavari yaMtan
nagumogamutODa mellana
nagumogamula satulaM~ joochi naga nErche nRipaa!
          నగవులన్ = నవ్వులతో; అవిద్య = మాయలయొక్క; పోడిమి = సమర్థత; నగుబాటుగ = పరిహాసముగ; చేయన్ = చేయగలుగుట; నేర్చు = తెలిసిన; నగవరి = చిరునవ్వులుగలవాడు; అంతన్ = అప్పుడు; నగు = నవ్వు; మొగము = మోము; తోడన్ = తోటి; మెల్లనన్ = మృదువుగ; నగుమొగముల = చిరునవ్వులుగల; సతులన్ = ఇంతులను; చూచి = కనుగొని; నగన్ = నవ్వుట; నేర్చెన్ = నేర్చుకొనెను; నృపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: