Tuesday, March 3, 2015

కృష్ణలీలలు

10.1-262-కంద పద్యము
రువైన కొడుకు మోవను
వెవిడి యిలమీఁదఁ బెట్టి వెఱచి జనని దా
రఁ గావఁ బుట్టిన మహా
పురుషుఁడు గాఁబోలు ననుచు బుద్ధిఁ దలంచెన్.
          అలా యశోద తొడలమీది కొడుకు బరువెక్కిపోతుంటే,
          ఇంత బరువుగా ఉన్న కొడుకును మోయలేక నేలమీద పడుకోబెట్టింది. బెదిరిపోతు తల్లి యశోద మనసులో ఇతగాడు లోకాన్ని కాపాడటానికి వచ్చిన కారణజన్ముడేమో అనుకుంది.
          అవును మరి సాధారణ పిల్లాడు కాదు కదా, లీలామాణవబాలకుడు కదా. అది గ్రహింపు అయినప్పటికి, వెంటనే మాయ కమ్మేసిందేమో. లేకపోతే నేలమీద పెడుతుందా కారణజన్ముని అని నా సందేహం.
10.1-262-kaMda padyamu
baruvaina koDuku mOvanu
veraviDi yilameeM~daM~ beTTi veRrachi janani daa
dharaM~ gaavaM~ buTTina mahaa
puruShuM~Du gaaM~bOlu nanuchu buddhiM~ dalaMchen.
          బరువైన = బరువెక్కినట్టి; కొడుకున్ = పుత్రుని; మోవను = మోయుటకు; వెరవిడి = భయపడి; ఇల = భూమి; మీదన్ = పైన; పెట్టి = ఉంచి; వెఱచి = బెదిరి; జనని = తల్లి; తాన్ = అతను; ధరన్ = భూమిని; కావన్ = కాపాడుటకు; పుట్టిన = జన్మించిన; మహా = గొప్ప; పురుషుడు = యత్నశీలి; కాబోలున్ = అయివుండవచ్చును; అనుచున్ = అనుకొని; బుద్దిన్ = మనసున; తలంచెన్ = భావించెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: