Tuesday, March 24, 2015

కృష్ణలీలలు

10.1-298-కంద పద్యము
పాపల విహరణములు
తీపులు పుట్టింప మరిగి తేఁకువ లే కా
గోపాల సతులు మక్కువ
నే నులును మఱచి యుండి రీక్షణపరలై.
         బలభద్ర కృష్ణుల బాల్యక్రీడలు ఆ మందలోని గోపికలకు మధుర మధురంగా కనిపిస్తున్నాయి. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మరచిపోయి, అదురు బెదురు లేకుండా ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తు ఉండిపోయారు.
10.1-298-kaMda padyamu
aa paapala viharaNamulu
teepulu puTTiMpa marigi tEM~kuva lE kaa
gOpaala satulu makkuva
nE panulunu maRrachi yuMDi reekShaNaparalai.
          = ; పాపల = శిశువుల; విహరణములున్ = క్రీడలు; తీపులు = ఆసక్తిని; పుట్టింపన్ = కలిగిస్తుండగ; మరిగి = ఆసక్తి పెరిగి; తేకువ = భయము; లేక = లేకుండగ; = ; గోపాల = యాదవ; సతులున్ = స్త్రీలు; మక్కువన్ = ప్రీతివలన; = ఏ యొక్క; పనులును = కార్యక్రమములను; మఱచి = మరిచిపోయి; ఉండిరి = ఉండిపోయారు; ఈక్షణ = చూచుట యందు; పరలు = లగ్నమైనవారు; = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: