Friday, March 27, 2015

కృష్ణలీలలు

10.1-301-వచనము
మఱియు నా కుమారుండు దినదినంబునకు సంచార సంభాషణ దక్షుండై.
10.1-302-ఉత్పలమాల
ప్పుడు చేయకుండు మని జంకె యొనర్చిన నల్గిపోవఁగా
ప్పుడు బార చాఁచి తన ర్మిలి విందులు వచ్చి రంచు న
వ్వొప్పఁగఁ జీరు తల్లి దెస కొత్తిలి కృష్ణుఁడు రంతు జేయుచు
న్నెప్పటియట్ల చన్గుడుచు నింపొలయన్ మొలగంట మ్రోయఁగన్.
          ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు  చక్కగా నేర్చుకున్నాడు.
          తల్లి యశోద అల్లరి చేయవద్దని బెదిరిస్తే, కొంటె కృష్ణుడు కోపగించి దూరంగా వెళ్ళిపోతాడు. అది చూసి నా కన్నతండ్రి! రా ప్రియ చెలికాళ్ళు వచ్చారు అంటు చేతులు చాపి పిలవగానే పరిగెత్తుకుంటు తల్లి దగ్గరకు వచ్చి అల్లరి చేస్తూ ఎప్పటిలాగా చనుబాలు త్రాగుతాడు. అలా అల్లరి చేస్తూ పరుగెడుతుంటే, మొలతాడుకు కట్టిన చిరుగంట ఘల్లుఘల్లున మ్రోగుతుంది. ఆ అల్లరి ఎంతో అందంగా ఉంటుంది.  
10.1-301-vachanamu
maRriyu naa kumaaruMDu dinadinaMbunaku saMchaara saMbhaaShaNa dakShuMDai.
10.1-302-utpalamaala
chappuDu chEyakuMDu mani jaMke yonarchina nalgipOvaM~gaa
nappuDu baara chaaM~chi tana yarmili viMdulu vachchi raMchu na
vvoppaM~gaM~ jeeru talli desa kottili kRiShNuM~Du raMtu jEyuchu
nneppaTiyaTla changuDuchu niMpolayan molagaMTa mrOyaM~gan.
          మఱియున్ = ఇంకను; కుమారుండు = పిల్లవాడు; దినదినంబున్ = రోజురోజు; కున్ = కి; సంచార = విహరించుటలు; సంభాషణ = మాట్లాడుట; దక్షుండు = వచ్చినవాడు; = అయ్యి.
          చప్పుడు = అల్లరి శబ్దములు; చేయక = చేయకుండా; ఉండుము = ఉండు; అని = అని; జంకె = బెదిరించుట; ఒనర్చినన్ = చేసినచో; అల్గి = అలిగి; పోవగాన్ = వెళ్ళిపోయి; అప్పుడు = అప్పటి కప్పుడే; బారచాచి = చేతులు నిడుపుగా చాపి; తన = అతని యొక్క; అర్మిలి = ప్రియ; విందులు = చెలికాళ్ళు; వచ్చిరి = వచ్చారు; అంచున్ = అనుచు; నవ్వొప్పగన్ = నవ్వొచ్చేటట్లుగ; చీరు = పిలుచు; తల్లి = తల్లి; దెసన్ = వైపున; కున్ = కు; ఒత్తిలి = గట్టిగా; కృష్ణుడు = కృష్ణుడు; రంతు జేయుచున్ = ఏడుస్తూ; ఎప్పటియట్ల = ఎప్పటిలాగనే; చన్నున్ = చనుబాలు; కుడుచున్ = తాగును; నింపు = చక్కదనము; ఒలయన్ = ఒలకబోస్తూ; మొలగంట = మొలకు కట్టిన చిరుగంట; మ్రోయగన్ = శబ్దము చేయగా.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: