8-475-మ.
"జనకుం డెవ్వడు? జాతుఁ డెవ్వఁడు? జనిస్థానంబు లెచ్చోటు? సం
జననం బెయ్యది? మేను లేకొలఁదిఁ? సంసారంబు లేరూపముల్?
వినుమా యింతయు విష్ణుమాయ దలఁపన్వేఱేమియున్ లేదు; మో
హ నిబంధంబు
నిదాన మింతటికి జాయా! విన్నఁబో నేటికిన్?
8-476-వ.
అగు
నయిననుం గాలోచిత కార్యంబు చెప్పెద.
టీకా:
జనకుండు = తండ్రి;
ఎవ్వడు = ఎవరు;
జాతుడు = పుత్రుడు;
ఎవ్వడు = ఎవరు;
జని = జన్మ;
స్థానంబులు =
స్థలములు; ఎచ్చోటు = ఏవి;
సంజననంబు = పుట్టుక;
ఎయ్యది = ఎట్టిది;
మేనులు =
జీవములు; ఏకొలది = ఎన్ని ఉన్నవి;
సంసారంబుల్ = సంసారములు;
ఏ = ఎట్టి; రూపముల్ =
స్వరూపముకలవి;
వినుమా = వినుము;
ఇంతయున్ = ఇదంతా;
విష్ణు = విష్ణుమూర్తియొక్క;
మాయ = మాయ; తలపన్ = తరచిచూసినచో;
వేఱు = ఇంక,
ఇతరము; ఏమియున్ = ఏమీ;
లేదు =
లేదు; మోహ = మాయయందు;
నిబంధంబు = తగులుకొనుట;
నిదానము = మూలకారణము;
ఇంతటి =
దీనంతటి; కిన్ = కి; జాయా = ఇల్లాలా;
విన్నబోన్ = చిన్నపుచ్చుకొనుట;
ఏటికిన్ =
ఎందుకు.
అగునయిననున్
= అలా అయినప్పటికిని;
కాల = కాలముకు;
ఉచిత = తగినట్టి;
కార్యంబున్ = పనిని;
చెప్పెద =
తెలిపెదను.
భావము:
“ఇల్లాలా! తండ్రి ఎవడు? కొడుకు ఎవడు? పుట్టిన స్ధలాలు ఏవి? పుట్టుకకు కారణము ఏమిటి? శరీరాలు ఏపాటివి? ఈ సంసారాలు ఏమాత్రమైనవి? ఆలోచిస్తే ఇదంతా భగవంతుడైన ఆ విష్ణుమూర్తి మాయ తప్ప మరేమీ కాదు. అజ్ఞానంలో బంధింపబడి ఉండడమె. దీనికి మూలం. అందువల్ల
జరిగిన దానికి చింతించి చిన్నబుచ్చుకోకు.
సరే, ప్రస్తుతానికి తగిన కార్యాన్ని చెబుతాను విను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment