Tuesday, November 1, 2016

వామన వైభవము : భగవంతుం

పయోభక్షణ వ్రతము
8-477-మ.
వంతుం బరముం జనార్దనుఁ గృపాపారీణు సర్వాత్మకున్
దీశున్ హరి సేవజేయు మతఁడున్ సంతుష్టనిం బొంది నీ
గు నిష్టార్థము లెల్ల నిచ్చు; నిఖిలార్థావాప్తి చేకూరెడిన్
వత్సేవలఁ బొందరాదె బహుసౌభాగ్యంబులం బ్రేయసీ! "
8-478-వ.
అనిన గృహస్థునకు గృహిణి యిట్లనియె.
టీకా:
          భగవంతున్ = భగవంతుని; పరమున్ = హరిని {పరముడు - సర్వాతీతమైవాడు, విష్ణువు}; జనార్దనున్ = హరిని {జనార్దనుడు - జనులను రక్షించువాడు, విష్ణువు}; కృపాపారీణున్ = దయాసముద్రుని; సర్వాత్మకున్ = హరిని {సర్వాత్మకుడు - సర్వులయందు వ్యాపించి యుండువాడు, విష్ణువు}; జగదీశున్ = హరిని {జగదీశుడు - లోకములకు ప్రభువు, విష్ణువు}; హరిన్ = హరిని {హరి - భక్తులహృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; సేవ = ఆరాధన; చేయుము = చేయుము; అతడున్ = అతడు; సంతుష్టినిన్ = సంతోషమును; పొంది = పొంది; నీవు = నీ; కున్ = కు; అగు = ఉన్న; ఇష్టార్థముల్ = కోరికలు; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చున్ = ప్రసాదించును; నిఖిల = సమస్తమైన; అర్థ = ప్రయోజనముల; అవాప్తి = పొందుట; చేకూరెడిన్ = సమకూరును; భగవవత్ = భగవంతుని; సేవలన్ = కొలచుటవలన; పొందరాదె = పొందవలసినది; బహు = అనేకమైన; సౌభాగ్యంబులన్ = శుభములను; ప్రేయసీ = ప్రియురాలా.
          అనినన్ = అనగా; గృహస్థున్ = భర్త; కున్ = కు; గృహిణి = ఇల్లాలు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:
            ప్రియురాలా! దితీ! విష్ణుమూర్తి భగవంతుడూ, పురుషోత్తముడూ, జనార్ధనుడూ, దయాసముద్రుడూ, సర్వాంతర్యామీ, జగదీశ్వరుడూ. కనుక అయనను ఆరాధించు. ఆయన సంతోషిస్తే చాలు. నీ కోరికలు అన్నీ తీరుస్తాడు. అన్ని ప్రయోజనాలూ నెరవేరుతాయి. అతనిని పూజించి సమస్త సంపదలను పొందు.”
            ఇలా హరిని పూజించమని చెప్పిన భర్త కశ్యపుని మాటలు విని భార్య అదితి ఇలా అంది.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: